India exports | చైనాకు భారీగా పెరిగిన భారత ఎగుమతులు.. ఐదు నెలల్లో 40 శాతం వృద్ధి..!
India exports | భారత్ (India) నుంచి చైనా (China) కు ఎగుమతులు అనూహ్యంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) చైనాకు భారత ఎగుమతులు సుమారు 40 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా 'మేడ్ ఇన్ ఇండియా (Made in India)' ఎలక్ట్రానిక్స్ (Electronics) ఉత్పత్తులు ఈ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
India exports : భారత్ (India) నుంచి చైనా (China) కు ఎగుమతులు అనూహ్యంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) చైనాకు భారత ఎగుమతులు సుమారు 40 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా ‘మేడ్ ఇన్ ఇండియా (Made in India)’ ఎలక్ట్రానిక్స్ (Electronics) ఉత్పత్తులు ఈ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య వాణిజ్యలోటు ఇప్పటికీ చైనాకు అనుకూలంగా కొనసాగుతోంది.
గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 3.18 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్మార్ట్ఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, డిస్ప్లే మాడ్యూల్స్ వంటివి వీటిలో ప్రధానమైనవి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలోనూ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 15 శాతానికిపైగా పెరిగాయి. ఇదే సమయంలో ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు సైతం 21 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి.
అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్ల కోసం అత్యాధునిక పరికరాలకు డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. “ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వంతో కూడిన సరఫరా వ్యవస్థలో భారత తయారీ రంగం తన విశ్వసనీయతను చాటుకుంటోంది” అని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మోహింద్రూ పేర్కొన్నారు.
అయితే ఈ వృద్ధి స్వల్ప స్థాయి నుంచి ప్రారంభమవడంతో చైనాతో నెలకొన్న భారీ వాణిజ్య లోటుపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి భారత్ దిగుమతులు 131.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం భారత ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

