girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన
girl molested in Bihar | విద్యార్థి జంటను కొందరు వ్యక్తులు అడ్డుకుని వేధించారు. బాలుడిపై దాడి చేయడంతో పాటు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నా: విద్యార్థి జంటను కొందరు వ్యక్తులు అడ్డుకుని వేధించారు. బాలుడిపై దాడి చేయడంతో పాటు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. (girl molested in Bihar) బీహార్‌లోని జమూయిలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న యువతి, యువకుడు శనివారం సాయంత్రం ట్యూషన్‌కు హాజరయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి స్కూటీపై టూరిస్ట్ ప్రాంతమైన మద్వా పహాడ్‌కు వెళ్లారు.
కాగా, ఆ జంట స్కూటీపై తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. ఒక వ్యక్తి బాలుడి చొక్కా కాలర్ పట్టుకుని లాగాడు. ఆ అమ్మాయి ప్రతిఘటించగా వారి పట్టునుంచి అతడు తప్పించుకున్నాడు. వారిద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోతుండగా ఆ వ్యక్తులు వెంబడించారు. ఒక వ్యక్తి యువతిని పట్టుకుని ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలుడు పరుగున వెళ్లి జోక్యం చేసుకున్నాడు.
అనంతరం ఆ జంట స్కూటీపై అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తులు వేధింపులు కొనసాగించారు. ఒక వ్యక్తి ఆ బాలిక చేయి పట్టుకుని లాగాడు. ఆ జంట చేత వారు క్షమాపణలు చెప్పించారు. ‘దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి. ఇకపై ఎప్పటికీ ఇక్కడికి రాబోమని మాటిస్తున్నాం’ అని ఆ బాలిక వేడుకున్నది. చివరకు ఆ వ్యక్తులు వారిని అక్కడి నుంచి వెళ్లనిచ్చారు.
మరోవైపు ఆ యువ జంటను వేధించిన గుంపులోని ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో క్లిప్‌ను పోలీసులకు ట్యాగ్ చేశారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చివరకు పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. మైనర్లైన బాలుడు, బాలికతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొందరి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ‘దుండగులు ఒక యువతిని అసభ్యంగా తాకుతూ, లాక్కెళ్తుండగా, ఆమె చేతులు జోడించి తనను వదిలిపెట్టమని వేడుకుంది. ఇలా ప్రవర్తించడానికి ఈ మనుషులకు ఎవరు హక్కు ఇచ్చారు? ఇది ‘సంస్కృతి’ కాదు. ఇది పితృస్వామ్యం: ఏ పురుషుడైనా ఒక అమ్మాయి శరీరాన్ని, ఆమె కదలికలను, ఆమె ఇష్టాలను శాసించవచ్చనే నమ్మకం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
📍Jamui, Bihar
A boy and girl, both reportedly Class 10 students, were returning from their coaching class. On their way back, a group of men stopped their scooter and started questioning them.
And when the two try to escape, the men chase them. A man grabs the girl, lifts… pic.twitter.com/Ome67VFI5m
— The Indian Idiot (@theindianidiot) September 21, 2026
🚨Shocking visuals from Bihar’s Jamui show a minor couple being stopped and harassed by a group of men; investigation underway pic.twitter.com/KdcahV1smD
— The Tatva (@thetatvaindia) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

