Watch: వృద్ధురాలిపైకి దూకి పంచ్ ఇచ్చిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?
Monkey Pouncing On Old Woman | ఇంటి ఆవరణలో నడుస్తున్న వృద్ధురాలిపై ఒక కోతి దాడి చేసింది. గోడ పైనుంచి ఆమెపైకి దూకి పంచ్ ఇచ్చింది. దీంతో ఆ వృద్ధురాలు కిందపడిపోయింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన వృద్ధురాలి కుమార్తెపై కూడా ఆ కోతి దాడి చేసింది.
బెంగళూరు: ఇంటి ఆవరణలో నడుస్తున్న వృద్ధురాలిపై ఒక కోతి దాడి చేసింది. గోడ పైనుంచి ఆమెపైకి దూకి పంచ్ ఇచ్చింది. దీంతో ఆ వృద్ధురాలు కిందపడిపోయింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన వృద్ధురాలి కుమార్తెపై కూడా ఆ కోతి దాడి చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Monkey Pouncing On Old Woman) కర్ణాటకలోని కొప్పల్లో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ రచయిత ఎం.ఎస్. సవదత్తి భార్య అయిన 91 ఏళ్ల నజమున్నిసా బేగం, బీబీ పాటిల్ నగర్లోని ఇంటి ఆవరణలో నడుస్తున్నది. ఒక కోతి అక్కడకు రావడాన్ని ఆమె గమనించింది. కంగారుపడిన ఆ వృద్ధురాలు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కోతి ఆమెపై దాడి చేసింది. వృద్ధురాలిపైకి జంప్ చేసి పంచ్ ఇవ్వడంతో ఆమె కింద పడిపోయింది.
కాగా, ఇది గమనించిన వృద్ధురాలి కుమార్తె తన తల్లిని కాపాడేందుకు పరుగున అక్కడకు వచ్చింది. అయితే ఆ కోతి ఆమెపైకి కూడా దూకి దాడి చేసింది. మరో వ్యక్తి అక్కడకు చేరుకోవడంతో అది పారిపోయింది. అనంతరం నజమున్నిసాను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకుంటున్నట్లు అనిపించినప్పటికీ, ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మరునాడు ఆ వృద్ధురాలు మరణించింది. ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డైన కోతి దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Koppal: 91-year-old Najamunnisa Begum, died after a monkey attacked and knocked her down in her home compound. Her daughter was also injured while trying to help. She passed away the next day during treatment.#Koppal #Karnataka #MonkeyMenace #viral @DKShivakumar pic.twitter.com/sGsWhE6fAz
— Monu Lodhi 🇮🇳 (@monu_lodh) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

