Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
Keerthy Suresh | చెన్నైలో జరిగిన 'సత్యవాన్ సావిత్రి' చిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దర్శకుడు మిస్కిన్ తనను ప్రశంసిస్తూ తొడ భాగం వైపు స్వల్పంగా తాకిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నటి కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
Keerthy Suresh | చెన్నైలో జరిగిన ‘సత్యవాన్ సావిత్రి’ చిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దర్శకుడు మిస్కిన్ తనను ప్రశంసిస్తూ తొడ భాగం వైపు స్వల్పంగా తాకిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నటి కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
ఈ వీడియోపై నెట్టింట పలువురు భిన్నంగా వ్యాఖ్యానించగా, ఒక యూజర్ ఆమె అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారని పేర్కొంటూ, సినిమాల్లో సన్నివేశాల కోసం తాకినప్పుడు బయట అలాంటి వాటికి ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ స్పందిస్తూ, తన ముఖంలో అసౌకర్యం ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు. తమ మధ్య తండ్రీకూతుళ్ల తరహా బంధం ఉందని తాము చెప్పిన మాటలు వినిపించలేదా అని నిలదీశారు. ఒకవేళ తాను అసౌకర్యంగా ఉన్నా, సినిమాల్లో తాకుతారు కాబట్టి బయట కూడా అలాగే ఉండాలని చెప్పడం సరికాదని హితవు పలికారు. కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆ నెటిజన్‌కి చురకలంటించారు. కీర్తి సురేష్ స్పందన తర్వాత ఆ నెటిజన్ తన పోస్ట్‌ను తొలగించి, తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని క్షమాపణ కోరారు. మరోవైపు, ఈ వ్యవహారంలో ఎలాంటి అసౌకర్యం గానీ, దురుద్దేశం గానీ లేదని కీర్తి స్పష్టం చేశారని మరికొందరు నెటిజన్లు కూడా పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

