టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న భర్తను కోల్పోయి తొమ్మిది నెలల గర్భిణి అయిన భార్య, ఐదేళ్ల కుమార్తె దిక్కులేనివారయ్యారు
టేకులపల్లి, నవంబర్ 20: ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న భర్తను కోల్పోయి తొమ్మిది నెలల గర్భిణి అయిన భార్య, ఐదేళ్ల కుమార్తె దిక్కులేనివారయ్యారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన మధు ఇసుక ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా అదే పనికి వెళ్లాడు. సంపత్ నగర్ నుంచి టేకులపల్లి వైపు వస్తుండగా అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజన్ మధుపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజమౌళి తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లపై నిఘా ఏదీ?
మండలంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు, వాటి వేగంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భర్తను కోల్పోయి తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న ప్రియ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
HCU | హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Nitesh Tiwari | బాక్సాఫీస్ చరిత్రలో నితేష్ తివారి కొత్త రికార్డు.. రెండు సార్లు రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

