Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
Rekha Naik | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఏకకాలంలో రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు.
Rekha Naik | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఏకకాలంలో రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు. రూ.40.96 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం అక్రమాల కేసులో మనీలాండరింగ్ కోణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
రేఖా నాయక్‌కు చెందిన ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు గతంలో పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. మూడు రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నులు లెక్కల్లో లేకుండా పోయినట్లు తేల్చారు. మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు గతంలోనే రేఖా నాయక్‌పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 316(2), 316(5), 318(4)తో పాటు నిత్యావసర సరుకుల చట్టం కింద క్రైమ్ నంబర్ 165/2026తో కేసు నమోదైంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
HCU | హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Nitesh Tiwari | బాక్సాఫీస్ చరిత్రలో నితేష్ తివారి కొత్త రికార్డు.. రెండు సార్లు రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి ఇండియన్ డైరెక్టర్!
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

