సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఓ మహిళను మృత్యువు కబళించింది. బస్సు ఎక్కే క్రమంలో పక్క నుంచి మరో బస్సు రావడంతో రెండింటి మధ్య చిక్కుకుని ఆమె ప్రాణాలు కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఓ మహిళను మృత్యువు కబళించింది. బస్సు ఎక్కే క్రమంలో పక్క నుంచి మరో బస్సు రావడంతో రెండింటి మధ్య చిక్కుకుని ఆమె ప్రాణాలు కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.
గురువారం సిద్దిపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) హాజరైంది. సభ ముగిసిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఆమె ఎక్కుతున్న బస్సు పక్క నుంచి మరో బస్సు రావడంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలైన సారవ్వ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
సారవ్వ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆమె మరణం తీరని లోటుగా మారింది. సభకు వెళ్లిన తల్లి తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఆమె మరణవార్త పిడుగులా మారింది. తల్లిని కోల్పోయిన పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబానికి మంత్రి పొన్నం భరోసా.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
సారవ్వ మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఆమె పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమావతి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో ఆ సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

