Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ప్రతిష్టాత్మక రొటర్డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (IFFR) లోని లైమ్లైట్ (Limelight) విభాగానికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన 'డోరతీ' (Dorothy) చిత్రం ఎంపికైంది.
ప్రతిష్టాత్మక రొటర్డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (IFFR) లోని లైమ్లైట్ (Limelight) విభాగానికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘డోరతీ’ (Dorothy) చిత్రం ఎంపికైంది. ప్రపంచ సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న IFFR వేదికపై ఈ సినిమా స్థానం సంపాదించడం చిత్రబృందానికి, సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శితమయ్యే చిత్రాలు అంతర్జాతీయ ప్రేక్షకులు, ఫిలిం మేకర్లు, విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తుండటంతో ‘డోరతీ’కి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తోంది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సనంతో, రిషికాంత్ ముఖ్య పాత్రలలో కనిపించారు. సిఖ్యా ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్, ధమ్మమ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. బలమైన కథనం, విభిన్నమైన ప్రెజెంటేషన్, ప్రముఖ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్, ప్రారంభం నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుకుంది.
గతంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF) వేదికగా ప్రీమియర్ ప్రదర్శనలు జరిపి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ‘డోరతీ’, సెప్టెంబర్‌లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫిలిం ఫెస్టివల్స్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు IFFR లైమ్లైట్ విభాగంలో చోటు దక్కించుకోవడం ఈ చిత్రానికి లభించిన మరో పెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
HCU | హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

