Rashmika Mandanna | ‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’..!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. 'నా భర్తను పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ' అని రాసుకొచ్చింది రష్మిక.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ జంట.. గురువారం ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటైంది. తమ జీవితంలోని అపురూపమైన క్షణాలను రష్మిక ఎక్స్ వేదికగా పంచుకుంది. తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని రాసుకొచ్చింది రష్మిక.
Hi my loves,
Introducing to you now “My Husband”! 💘
Mr. Vijay Deverakonda!! ❤️
The man who taught me what true love feels like,
The man who showed me what being in peace feels like! 🤍
The man who told me everyday that dreaming big was absolutely ok and constantly telling… pic.twitter.com/MPrsGfNTwb— Rashmika Mandanna (@iamRashmika) February 26, 2026
‘హాయ్ నా ప్రియమైనవాళ్లు..
మీ అందరికీ నా భర్తను పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.
నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పిన వ్యక్తి, ప్రశాంతతగా ఉండడం ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి, పెద్ద కలలు కనడంలో తప్పేమీ లేదని రోజూ నాకు చెప్పిన వ్యక్తి.. నేను సాధించలేనని అనుకున్న వాటికంటే గొప్పగా కొన్ని చేయగలని పదేపదే నాకు చెప్పిన వ్యక్తి.
నేను స్వేచ్ఛగా ఉండేందుకు అడ్డుచెప్పని వ్యక్తి, స్నేహితులతో కలిసి పర్యటనలకు వెళ్లడం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పిన వ్యక్తి.. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తిపై పుస్తకం రాస్తాను.
నేను కలలు గన్న మహిళగా మారడానికి.. నేను ఈ స్థాయికి చేరడానికి కారణం నువ్వే. నీ సమక్షంలో ఉండడం నిజంగా ఒక ఆశీర్వాదం. కానీ. నీకు తెలుసా.. అనుకోకుండా నేను సాధించిన విజయాలు, పడిన కష్టాలు, అనుభవించిన సంతోషాలు, బాధ, జీవితం.. ఇవన్నీ ఇప్పుడు అర్ధవంతంగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ నీ వల్లే సాధ్యమయ్యాయి. ఇవన్నీ కళ్లారా చూడడంలో నీ పాత్ర చాలా పెద్దది.
అందుకే నీ భార్యను అయినందకు చాలా చాలా చాలా సంతోషంగా ఉన్నా. నీ భార్యగా పిలిపించుకునేందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. ఇప్పుడంతా ఫుల్ పార్టీ టైమ్.
మనమిద్దరం కలిసి గొప్ప జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ’ అని భర్త విజయ్‌పై తన మనసులో దాచుకున్న ప్రేమనంతా కుమ్మరించింది రష్మిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

