ప్రొటీన్ అంటే కేవలం మాంసాహారం నుంచే అధికంగా లభిస్తుందన్న అపోహ అందరిలోనూ ఉంది. కానీ, అంతకుమించిన ప్రొటీన్ శాకాహారంలోనూ దొరుకుతుంది. వందలోపు ఖర్చుతో మనం కోరుకునే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన భారతీయ సంప్రదాయ వంటకాలలో ఉపయోగించే పనీర్, సోయా చంక్స్, రాజ్మా, పప్పులు లాంటి ఆహారాలు ప్రొటీన్ పవర్ హౌస్‌లుగా పేరొందాయి. అవి మాత్రమే కాకుండా ఎర్రపప్పు, కందిపప్పు లాంటి పప్పు ధాన్యాలు, బొబ్బర్లు వంటి చికుడు జాతి గింజలు, పెరుగు సైతం ఈ కోవకు చెందినవే. ఇవన్నీ కూడా మాంసాహారాన్ని మించిన ప్రొటీన్‌ను మనకు అందిస్తాయి. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రా. ప్రొటీన్ విలువలు, 100 గ్రాముల సోయా చంక్స్‌లో 52 గ్రా.,
100 గ్రాముల నల్ల శనగల్లో 19 గ్రా., 100 గ్రాముల రాజ్మాలో 24 గ్రా. ప్రొటీన్ లభిస్తుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పదార్థాలన్నీ నిత్యం మనకు అందుబాటులో ఉన్నవే! ఎందుకు ఆలస్యం.. శాకాహారంలోనే ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఆస్వాదించండి.