Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Asif Zardari | ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్ (India) ను కవ్వించడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బాధ్యతలను ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) తీసుకున్నాడు. తమ దేశంతో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని అనుచిత ఆరోపణ చేశాడు.
Asif Zardari : ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్ (India) ను కవ్వించడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బాధ్యతలను ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) తీసుకున్నాడు. తమ దేశంతో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని అనుచిత ఆరోపణ చేశాడు. సింధూ జలాల ఒప్పందం రద్దుపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నదని అక్కసు వెళ్లగక్కారు.
ప్రాంతీయ శాంతికి మద్దతుదారుగా తాను ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నానని జర్దారీ తెలిపారు. భారత అధికారులు యుద్ధం చేయాలన్న ఆలోచనల నుంచి వెనక్కి తగ్గి తమతో చర్చలకు రావాలని అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి, కశ్మీర్లోని ప్రజలకు అవసరమైన దౌత్యపరమైన సాయాన్ని అందించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అదేవిధంగా పాకిస్థాన్లో శాంతిని అస్థిరపరిచేందుకు అఫ్గాన్ ప్రయత్నాలు చేస్తోందని, వాటిని అడ్డుకోవడానికి తమ దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
అదేవిధంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణను జర్దారీ ఖండించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం సరైన చర్య కాదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

