Maganuru | పట్టపగలే మట్టి దందా.. యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు.. మామూళ్ల మత్తులో అధికారులు!
Maganuru | నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Maganuru | మాగనూరు, ఆగస్టు 11: నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్స్కవేటర్లతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి తవ్వకాలకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? తవ్విన మట్టిని తరలించేందుకు రవాణా అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. మైనర్ మినరల్స్ తవ్వకం, రవాణా, అక్రమ క్వారీయింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మైనింగ్ శాఖపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే దందా?
గత కొన్ని నెలలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్స్కవేటర్లు, టిప్పర్లు తిరుగుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇంత బహిరంగంగా తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
భారీ గోతులతో ప్రమాదం
అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడితే భూమి స్వరూపం దెబ్బతినడంతోపాటు భారీ గోతులు ఏర్పడి వర్షాకాలంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? అనే విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులను వివరణ కోరగా.. ప్రస్తుతం మూడు రోజుల సెలవులు ఉన్నాయని, ఇప్పటివరకు ఎవరికీ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో నల్లగట్టు శివారులో జరుగుతున్న తవ్వకాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

