Bandla Ganesh | కూతురి సంగీత్‌లో చిన్నపిల్లాడిలా మారిపోయిన బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న తండ్రికూతుళ్ల వీడియో!
Bandla Ganesh | టాలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తన కుమార్తె జనని బండ్ల వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.
Bandla Ganesh | టాలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తన కుమార్తె జనని బండ్ల వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జనని నిశ్చితార్థం వైభవంగా జరగగా.. తాజాగా ఆమె ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల వివాహం సూర్య తేజ చిలుకూరితో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే జరిగిన నిశ్చితార్థ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.
ఇక తాజాగా జనని బండ్ల సంగీత్ వేడుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బండ్ల గణేష్ తన కుమార్తెతో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తన హోదా, స్థాయిని పక్కనపెట్టి కూతురి సంతోషం కోసం చిన్నపిల్లాడిలా మారిపోయిన ఆయన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. సంగీత్ వేడుకలో తన కుమార్తెపై ప్రేమను చాటుతూ బండ్ల గణేష్ ఆమె బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, అనుబంధం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సన్నివేశాలు చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
‘తండ్రీకూతుళ్ల బంధం అంటే ఇలాగే ఉండాలి’, ‘కూతురి పెళ్లి సమయంలో తండ్రి ఆనందం చూస్తుంటే చాలా బాగుంది’, ‘బండ్ల గణేష్ నిజంగా ది గ్రేట్ ఫాదర్’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.బండ్ల గణేష్ కుమార్తె వివాహం గురించి చర్చ మొదలైనప్పటి నుంచి ఆమెకు తండ్రి ఇవ్వబోయే కానుకలు, కుటుంబ ఆస్తులు, పెళ్లి ఖర్చులు వంటి విషయాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం వాటన్నింటికంటే తన కుమార్తెపై బండ్ల గణేష్‌కు ఉన్న ప్రేమే అత్యంత విలువైనదని చూపిస్తోంది. జనని బండ్ల-సూర్య తేజ చిలుకూరి వివాహం 2026 ఆగస్టు 16న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
A post shared by The పెళ్లి Gola | Wedding Content Creators✨ (@thepelligola)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

