స్కూళ్ల వ్యాపారం
మైండ్వాల్ట్.. ఇది రాష్ట్రంలో నంబర్-1 నేత కూతురు హైదరాబాద్ నగరంలో ఏర్పాటుకు ముస్తాబవుతున్న కార్పొరేట్ స్కూల్. మావ్ ఎడ్యూ.. ఇదీ రాష్ట్రంలోని నంబర్-2 నేత కూతురు ఆరంభించాలనుకొన్న ఇంటర్నేషనల్ స్కూల్ పేరు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన సరార్ బడులు సౌకర్యాల లేమితో సతమతమవుతుంటే.. అధికారంలో ఉన్న కీలక నేతల కుటుంబాలు మాత్రం కార్పొరేట్, అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో భారీ పెట్టుబడులు పెడుతున్నారు.
- నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’
- నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’
- ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన
- పాలక కుటుంబాలే ప్రైవేట్ విద్యారంగంలోకి!
- భారీ ఫీజులతో రానున్న మైండ్వాల్ట్
- బ్రిటన్‌కు చెందిన బ్రైటన్ కాలేజీతో మావ్ ఎడ్యూ అంతర్జాతీయ భాగస్వామ్యం
- హైదరాబాద్ సిటీలో 2027 ఆగస్టులో తొలి స్కూల్ ఆరంభానికి సన్నాహాలు
- దక్షిణ భారతదేశం పరిధిలో మరిన్ని అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటుకు ప్లాన్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మైండ్వాల్ట్.. ఇది రాష్ట్రంలో నంబర్-1 నేత కూతురు హైదరాబాద్ నగరంలో ఏర్పాటుకు ముస్తాబవుతున్న కార్పొరేట్ స్కూల్. మావ్ ఎడ్యూ.. ఇదీ రాష్ట్రంలోని నంబర్-2 నేత కూతురు ఆరంభించాలనుకొన్న ఇంటర్నేషనల్ స్కూల్ పేరు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన సరార్ బడులు సౌకర్యాల లేమితో సతమతమవుతుంటే.. అధికారంలో ఉన్న కీలక నేతల కుటుంబాలు మాత్రం కార్పొరేట్, అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. నంబర్-1 నేత కూతురి పేరుతో మైండ్వాల్ట్ కార్పొరేట్ సూల్ వ్యవహారం తెరపైకి రాగా, నంబర్ -2 నేత కుమార్తె భాగస్వామిగా ఉన్న మావ్ ఎడ్యూ సంస్థ ఏకంగా బ్రిటన్‌కు చెందిన విద్యాసంస్థతో చేతులు కలిపింది. పాలక కుటుంబాల వ్యాపార ఆసక్తులు ప్రైవేట్ విద్యారంగం చుట్టూ కేంద్రీకృతం కావడం చర్చనీయాంశంగా మారింది.
మైండ్వాల్ట్లో రూ.2.50 లక్షల ఫీజు?
నంబర్-1 నేత కూతురి పేరుతో ముడిపడిన మైండ్వాల్ట్ కార్పొరేట్ పాఠశాల వ్యవహారం రాష్ట్రంలో విద్యారంగంపై జరుగుతున్న చర్చలో కీలకంగా మారింది. కొంపల్లిలో ఈ పాఠశాల నిర్మాణం కొనసాగుతున్నది. ఇతర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థల విస్తరణకు ప్రణాళికలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకో విద్యార్థికి ఏడాదికి సుమారు రూ.2.50 లక్షల ఫీజు ఉండే స్థాయిలో ఈ పాఠశాల విద్యా నమూనా ఉంటుందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్ విద్యను మరింత విస్తరించే దిశగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. నంబర్-1 నేత కుటుంబానికి సంబంధించిన ఈ విద్యావ్యాపార వ్యవహారం.. ప్రభుత్వ విద్యావ్యవస్థ పరిస్థితితో పోల్చి చూస్తే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది.
మావ్ఎడ్యూ బ్రైటన్ కాలేజీతో భాగస్వామ్యం
నంబర్-2 నేత కుమార్తె భాగస్వామిగా ఉన్న మావ్ఎడ్యూ అంతర్జాతీయ విద్యారంగంలోకి అడుగుపెట్టింది. ఇది బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక బ్రైటన్ కాలేజీతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్ లో 2027 ఆగస్టులో తొలి బ్రైటన్ కాలేజీ పాఠశాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. కంపెనీల రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం ఈ సంస్థ 2026 జూలై 21న నమోదైంది. నంబర్-2 నేత కుమార్తెతోపాటు మరో ఇద్దరు సంస్థలో డిజిగ్నేటెడ్ భాగస్వాములుగా ఉన్నారు.
సంస్థ ఏర్పాటైన కొద్దికాలంలోనే అంతర్జాతీయ విద్యాసంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం గమనార్హం. మావ్ఎడ్యూ వెనుక రాఘవ గ్రూప్ వ్యవస్థాపకులు ఉన్నారని, తెలంగాణలో ఆ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగాల్లో వ్యాపార నేపథ్యం ఉన్నదని సంస్థకు సలహాదారుగా వ్యవహరించిన నోవిస్ట్రా క్యాపిటల్ వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసే హకులను కూడా మావ్ ఎడ్యూ పొందినట్టు సమాచారం. బ్రైటన్ కాలేజీకి భారత్‌లో ఇదే తొలి ప్రవేశం కావడం గమనార్హం. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేయడం, ప్రీమియం విద్యను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా సంస్థ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ పాఠశాలల కేంద్రంగా ఎదిగే క్రమంలో మావ్ ఎడ్యూ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

