ప్రతి రైతుభూమీ రీ సర్వే
కాంగ్రెస్ సర్కార్ రైతుల నెత్తిన మరో కుంపటి పెడుతున్నదా? దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూమికి ఎసరు తెస్తున్నదా? తాతముత్తాతల కాలం నాటి సరిహద్దులు చెరిగిపోతాయా? పాస్‌బుక్‌లో ఉన్న భూమి కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో కోత పడుతుందా? అన్నదాతల మధ్య, ఒకే కంచె పంచుకున్న పొలాల మధ్య సరార్ రీ సర్వే చిచ్చుపెడుతున్నదా? అంటే అవును అనే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి.
- అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
- రాష్ట్రమంతా భూముల రీ సర్వేకు ఆదేశం
- భూముల కొలతలతో పల్లెల్లో కొత్త చిచ్చు
- వివాద భూములను వదిలి అన్నింటిపైనా?
- సర్కార్ నిర్ణయంపై అనేక అనుమానాలు
- పాతకాలం సర్దుబాట్లు, వారసత్వ
- పంపకాలతో పొజిషన్లో హెచ్చుతగ్గులు
- సర్వే దెబ్బకు హద్దుల తారుమారు ఖాయం
- రికార్డులో కన్నా ఎక్కువ భూమి ఉంటే
- అది తనదని నిరూపించుకోవాల్సిందే!
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ రైతుల నెత్తిన మరో కుంపటి పెడుతున్నదా? దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూమికి ఎసరు తెస్తున్నదా? తాతముత్తాతల కాలం నాటి సరిహద్దులు చెరిగిపోతాయా? పాస్‌బుక్‌లో ఉన్న భూమి కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో కోత పడుతుందా? అన్నదాతల మధ్య, ఒకే కంచె పంచుకున్న పొలాల మధ్య సరార్ రీ సర్వే చిచ్చుపెడుతున్నదా? అంటే అవును అనే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే పేరిట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విడుదలచేసిన మార్గదర్శకాలు తెలంగాణ పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, నిబంధనలు మాత్రం రైతన్నలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
నాటి సర్దుబాట్లు.. నేడు అగచాట్లు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విస్తీర్ణం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మెజారిటీ కేసుల్లో క్షేత్రస్థాయిలోని భూ విస్తీర్ణానికీ, రికార్డుల్లోని విస్తీర్ణానికీ మధ్య పొంతన ఉండదు. ఇందుకు కారణం దశాబ్దాలపాటు భూ సర్వే నిర్వహించకపోవడమే. ఉమ్మడి కుటుంబాల విభజన, అన్నదమ్ముల మధ్య నోటిమాట సర్దుబాట్లు, కాలిబాటలు, బండిబాటల కోసం భూమిని వదులుకోవడం, సాగునీటి కాలువల నిర్మాణం వంటి కారణాలతో రికార్డుల్లోని విస్తీర్ణానికీ, వాస్తవిక సాగు (పొజిషన్)లో ఉన్న భూమికీ మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి.
ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహనతో జరిగిన భూ పంపకాలు, పొలాల మధ్య దారులు, హద్దుల సర్దుబాట్లు ఇప్పుడు అధికారిక కొలతల్లోకి వచ్చేసరికి కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు గతంలో ఒక సర్వే నంబర్లో ముగ్గురు రైతుల పేర్లపై ఐదు ఎకరాల భూమి ఉన్నదనుకుందాం. ఆ రైతుల మధ్య సర్దుబాట్లు, దారికి భూములను వదులుకోవడం తదితర కారణాలతో ప్రస్తుతం అక్కడ తక్కువ భూమి ఉంటుంది. ఇప్పుడు రీ సర్వే పేరిట అధికారులు తక్కువ భూమికే మ్యాప్ గీసి, పాస్‌బుక్‌లోనూ అంతే విస్తీర్ణం నమోదు చేస్తారు. ఈ అంశమే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కేవలం నోటిమాటలతో సర్దుబాట్లు చేసుకున్న రైతులు, అన్నదమ్ములు నిండామునుగుతారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏండ్లుగా సాగులో ఉన్న భూమిని పాత సర్దుబాట్లతో అనుభవిస్తున్న రైతులకు కొత్త కొలతలు ఇబ్బందికరంగా మారనున్నాయి.
నిరూపించుకుంటేనే భూమి దకుతుందట!
రీ సర్వేలో భాగంగా సీసీఎల్ఏ జారీచేసిన ఆరు దశల ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్వోపీ) రైతులకు భరోసా ఇవ్వకపోగా, కొత్త చికులు తెచ్చిపెడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం, క్షేత్రస్థాయి కొలతల మధ్య తేడా వస్తే రైతుల హకులకు భంగం కలిగేలా నిబంధనలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సర్వేలో రికార్డుల్లోని విస్తీర్ణానికీ, క్షేత్రస్థాయిలోని విస్తీర్ణానికీ మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు రైతులకు ఇబ్బందిగా మారనున్నది. ఎక్కువ భూమి తేలితే దానికి సంబంధించిన హక్కును నిరూపించుకోవాల్సిన బాధ్యత రైతుల మీదకే నెడుతున్నారు.
ఆ భూమి తనదేనని పాత పట్టాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇతర రెవెన్యూ ఆధారాలు చూపించి నిరూపించుకోవాలి. లేనిపక్షంలో ఆ భూమిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయాందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో ఉన్న దానికంటే తక్కువ భూమి ఉంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఫీల్డ్‌లో ఉన్న విస్తీర్ణానికే పాస్‌బుక్ ఇస్తుంది. మిగిలిన భూమి ఎటుపోయిందో, ఎవరి ఖాతాలో కలిసిందో తేల్చే బాధ్యత మాత్రం తీసుకోదు. ఈ అంశమే ఇప్పుడు రైతులను కలవరపెడుతున్నది.
ప్రశాంత పల్లెల్లో చిచ్చు.. పాలోళ్ల మధ్య వైరం!
రీ సర్వేలో అత్యంత ప్రమాదకరమైన అంశం ‘పరస్పర సమ్మతి’ (మ్యూచువల్ కన్సెంట్) నిబంధన. ఉమ్మడి ఖాతాలు, ఉమ్మడి ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు (ఎల్పీఎంలు), ఒకరి పేరుపై పట్టా ఉండి, మరొకరు సాగులో ఉండటం వంటి ఎనిమిది రకాల సమస్యలను గ్రామస్థాయిలో నాలుగు రోజుల్లో చర్చలు జరిపి, పొరుగు రైతుల పరస్పర అంగీకారంతో పరిషరించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూమి విలువలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత రోజుల్లో గుంట భూమి కోసం కూడా తగాదాలు జరిగే పరిస్థితి ఉన్నది. అలాంటిది, దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న రైతులు, పాలోళ్లు, అన్నదమ్ముల మధ్యకు కొలతల గొడవను తీసుకెళ్లడం వల్ల ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో భూతగాదాలు భగ్గుమనే ప్రమాదం పొంచి ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఒకరి భూమి తగ్గితే మరొకరి భూమి పెరిగే పరిస్థితుల్లో పరస్పర అంగీకారం ఎలా కుదురుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తమ హకుల విషయంలో రైతులు రాజీ పడకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పరస్పర సమ్మతి కుదరకపోతే ఆర్డీవో, అదనపు కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు, క్షేత్రస్థాయి తనిఖీలు అంటూ రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి దాపురించవచ్చనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీ సర్వే మార్గదర్శకాలు రైతుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

