బ్రాండ్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ గూండాయిజం!
హైదరాబాద్ ప్రతిష్టను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర చేష్టలతో మంటగలుపుతున్నారు. దశాబ్దాల కృషితో నిర్మించుకున్న ‘బ్రాండ్ హైదరాబాద్' ఇమేజ్‌పై కొండాపూర్ నాలెడ్జ్ సిటీలోని మెటా కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర మచ్చగా మిగిలింది. ఒకవైపు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు, సదస్సులు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు సొంత పార్టీ అనుబంధ సంఘాల అరాచకాలను కట్టడి చేయలేక చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
- అంతర్జాతీయ వేదికపై నగరం పరువు తీస్తున్న అధికార పార్టీ తీరు
- పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం
- భవిష్యత్తులో కొత్త కంపెనీలు రావాలంటే భయపడే దుస్థితి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ప్రతిష్టను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర చేష్టలతో మంటగలుపుతున్నారు. దశాబ్దాల కృషితో నిర్మించుకున్న ‘బ్రాండ్ హైదరాబాద్’ ఇమేజ్‌పై కొండాపూర్ నాలెడ్జ్ సిటీలోని మెటా కార్యాలయంపై జరిగిన దాడి తీవ్ర మచ్చగా మిగిలింది. ఒకవైపు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు, సదస్సులు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు సొంత పార్టీ అనుబంధ సంఘాల అరాచకాలను కట్టడి చేయలేక చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్భానుచిబ్, ఇన్చార్జి మణిశర్మ సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సై వ్యూ వాణిజ్య సముదాయంలోని మెటా కార్యాలయంపై విరుచుకుపడ్డా రు. ఆందోళనకారులు ప్రాంగణంలోని పూలకుండీలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. రాయదుర్గం పోలీసులు 21 మంది నాయకులను అదుపులోకి తీసుకుని ఆ తర్వా త విడుదల చేశారు. అంతర్జాతీయ సంస్థల వద్ద ఇలా వీరంగం సృష్టించడం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న కంపెనీలు విస్తరణకు వెనుకాడటమే కాకుండా.. కొత్త సంస్థలు నగరం వైపు చూడటానికి కూడా భయపడే ప్రమాదం ఉన్నది.
ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం
ప్రశాంతమైన వాతావరణం, పటిష్టమైన శాంతిభద్రతలు ఉన్నందునే మెటా వంటి దిగ్గజ సంస్థలు దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. దీనివల్ల లక్షలాది మంది తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల దుందుడుకు చర్యల వల్ల ఆ ఐటీ ఎకోసిస్టమ్ దెబ్బతింటే, అంతిమంగా నష్టపోయేది నిరుద్యోగ యువతేనని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అంతర్జాతీయ సంస్థల వద్ద ఇలా వీరంగం సృష్టించడం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నదని, ఆందోళనకారులపై కఠిన కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనలతో పెట్టుబడులు రావని, క్షేత్రస్థాయిలో రక్షణ కల్పించినప్పుడే ‘బ్రాండ్ హైదరాబాద్’ నిలబడుతుందని స్పష్టంచేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ అనుబంధ సంఘాలు చేస్తున్న ఇటువంటి చిల్లర చేష్టలు అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పరువును తీస్తున్నాయని మండిపడుతున్నారు. ఐటీ కారిడార్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, పెట్టుబడిదారుల్లో తిరిగి విశ్వాసం నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నదని పేర్కొంటున్నారు.
హైదరాబాద్ ప్రతిష్టకు గొడ్డలిపెట్టు
- గూండాయిజంతో బ్రాండ్‌ను దెబ్బతీస్తారా?
- మూడేండ్ల్లలో ఒక పెద్ద సంస్థనైనా తీసుకొచ్చారా?
- కంపెనీలను భారత్‌కు తీసుకొచ్చే మార్గం ఇదేనా?
- కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

దశాబ్దాలుగా అనేక అనుకూల పారిశ్రామిక విధానాలతో నిర్మించుకున్న బ్రాండ్ హైదరాబాద్ ప్రతిష్ఠను కాంగ్రెస్ పాలకులు దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మెటా కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టడం, దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కేటీఆర్ శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటన కార్యాలయ అద్దాల ధ్వంసం మాత్రమే కాదని, దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సంపాదించుకున్న విశ్వసనీయతను, పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ బ్రాండ్ ఒకరోజులో ఏర్పడలేదని, అనేక సంవత్సరాలపాటు అనుసరించిన, వ్యాపార అనుకూల విధానాలు, తాము కష్టపడి నిర్మించిన పారిశ్రామిక వాతావరణం ఫలితంగానే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేరొన్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపస్
అనేక ప్రయత్నాల తర్వాత మెటా సంస్థ దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. సురక్షిత, అనుకూలమైన పని వాతావరణం ఉంటుందని తాము హామీ ఇచ్చి భరోసా కల్పించినందు వల్లే మెటా ఈ క్యాంపస్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నదని గుర్తుచేశారు. సోషల్ మీడియా ఖాతాలను మెటా నిలిపివేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మూర్ఖులు ఆ సంస్థ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం గొప్ప విషయంగా భావించడమే కాకుండా, దానిని బహిరంగంగా గొప్పగా చెప్పుకోవడం ఆ పార్టీ తీరుకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో మూడేండ్ల పాలనలో మెటా వంటి ఒక పెద్ద బ్రాండ్నైనా హైదరాబాద్‌కు తీసుకురాగలిగారా? అని ప్రశ్నించారు. కంపెనీలను భారత్‌కు తీసుకురావడానికి గూండాయిజమే మార్గమని రాహుల్‌గాంధీ భావిస్తున్నారా? అని నిలదీశారు. ఇక్కడ అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఇదే తరహాలో గూండాయిజం చేస్తూ కంపెనీలను తీసుకొచ్చే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

