Donald Trump | ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న భయం.. టర్కీ నుంచి బ్రిటన్కు ట్రంప్ సీక్రెట్ జర్నీ..!
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గత నెలలో టర్కీ పర్యటన (Turkey tour) ముగించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు బ్రిటన్ (Britain) కు అత్యంత రహస్యంగా ప్రయాణించినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్ (Washington Post)’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గత నెలలో టర్కీ పర్యటన (Turkey tour) ముగించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు బ్రిటన్ (Britain) కు అత్యంత రహస్యంగా ప్రయాణించినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్ (Washington Post)’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ (Iran) నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల భయంతో ఆయన అందరూ భావించినట్లు ఎయిర్ఫోర్స్ వన్లో కాకుండా మరో సైనిక విమానంలో రహస్యంగా ప్రయాణించారని ఆ కథనం పేర్కొన్నది.
వివరాల్లోకి వెళ్తే.. టర్కీ రాజధాని అంకారాలో నాటో సదస్సు ముగిశాక ట్రంప్.. కెమెరాల ముందు పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే ఆ తర్వాత ఆయనను ఒక ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా రహస్యంగా మరోచోట ఉన్న చిన్న సైనిక విమానం (ఎయిర్ఫోర్స్ సి-32ఏ) వద్దకు తరలించారు. ఆ విమానంలోనే ఆయన బ్రిటన్కు చేరుకున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ట్రంప్ ప్రయాణిస్తున్నట్లు అందరూ భావించిన ఎయిర్ఫోర్స్ వన్ విమానం కూడా కొన్ని నిమిషాల తేడాతో అక్కడికి చేరుకుంది.
పాత జ్ఞాపకాల కోసం ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేసినప్పటికీ అసలు కారణం ఇరాన్ నుంచి పొంచి ఉన్న భద్రతా ముప్పేనని స్పష్టమవుతోంది. ఈ కథనంపై వైట్హౌస్ స్పందిస్తూ.. ‘అధ్యక్షుడిపై అమెరికా శత్రువులు కన్నేశారు. వారి నుంచి రక్షణ కల్పించడానికి మా వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తాం’ అని కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవ్ చుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ రహస్య ప్రయాణంపై పెంటగన్ ఇంకా స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

