Jadcherla | మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.. నలుగురి సస్పెన్షన్
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
Jadcherla | మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసి బంధువులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూసిన బంధువులకు ఓ కుక్క మృతదేహాన్ని పీక్కుతినడం కనిపించింది. కుటుంబీకులు ఈ ఘటనను వీడియో తీసి, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇంత ఘోరమైన పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుసింది. దవాఖాన వైద్యులు, సిబ్బంది వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

