ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
తెలంగాణ రాష్ట్ర ఎర్పాటుకు ఢిల్లీ పెద్దలను గడ గడ లాడించిన చరిత్ర కే సి ఆర్ దే నని ఎంపీ వద్ది రాజు రవి చంద్ర అన్నారు.
భద్రాద్రి కొత్త గూడెం. నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర ఎర్పాటుకు ఢిల్లీ పెద్దలను గడ గడ లాడించిన చరిత్ర కే సి ఆర్ దే నని ఎంపీ వద్ది రాజు రవి చంద్ర అన్నారు. కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షుతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్టం కోసం అన్ని పార్టీలను ఏకం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని అన్నారు. కాంగ్రెస్ ఈనాడు, ఆనాడుతెలంగాణకు మోసం చేసిందన్నారు. డీలిమిటెషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరే కించిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ లో కూడా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మళ్లీ గెలిపించాలని అన్నారు.
వచ్చేది రాష్టంలో బీఆర్ ఎస్ పార్టీ నే అన్నారు. ఆనాడు సై ఇప్పుడు నై అంటున్నారని ఆయన విమర్శించారాని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నియోజక వర్గాలు పెంచాలని అన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేది బీఆర్ ఎస్ ప్రభుత్వమే నని అన్నారు. ఎంపీ వద్ది రాజు రవిచంద్ర నాయకత్వంలో పనిచేద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల ను ఎంపిక చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కాపు సీతా లక్ష్మి, సీనియర్ నాయకులు మంత పురి రాజు గౌడ్, మల్లెల రవి చంద్ర, డిష్ నాయుడు, అన్వర్ పాషా, కొట్టి వెంకటేశ్వర్లు, దామోదర్, జగన్, కార్పొరేటర్లు సాగర్, రాంబాబు, మధు చంద్, గుణ చరిత్, వీరమ్మ, బాధవత్ శాంతి, సోనా,అనుదీప్, రాజశేఖర్, యాకయ్య, దూడల పార్వతి, మునీర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | 1951లో మొట్టమొదట జనగణన.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

