Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
Student Attempts Suicide | ర్యాగింగ్ కారణంగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థులు అతడిని కాపాడారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు మెడికల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు సీనియర్లను సస్పెండ్ చేసింది.
గాంధీనగర్: ర్యాగింగ్ కారణంగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థులు అతడిని కాపాడారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు మెడికల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు సీనియర్లను సస్పెండ్ చేసింది. (Student Attempts Suicide) గుజరాత్‌లోని వడోదరలో ఉన్న జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు జూనియర్లు హాస్టల్ వద్ద బాణసంచా కాల్చడంపై వివాదం చెలరేగింది. అర్ధరాత్రి వేళ సీనియర్ విద్యార్థులు ఆ ముగ్గురు జూనియర్లను ఒక రూమ్‌కు పిలిపించారు. పరీక్షల సమయంలో టపాసులు కాల్చడంపై దూషించడంతో పాటు సీనియర్లు తమను మానసికంగా వేధించినట్లు జూనియర్ విద్యార్థులు ఆరోపించారు.
కాగా, సీనియర్ల ర్యాగింగ్ తర్వాత మానసిక ఒత్తిడికి గురైన జూనియర్ విద్యార్థులలో ఒకరు హాస్టల్ గది నుంచి కిందకు దూకడానికి ప్రయత్నించగా మరో విద్యార్థి అతడిని కాపాడాడు. అలాగే బాధిత విద్యార్థులు ర్యాగింగ్ గురించి జాతీయ వైద్య కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మరోవైపు బాధిత విద్యార్థుల ఫిర్యాదుపై యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. ఆరోపణలున్న ఐదుగురు సీనియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు మెడికల్ కాలేజీ నుంచి బహిష్కరించారు. ఆరు నెలల పాటు వారు హాస్టల్లోకి ప్రవేశించలేరని కాలేజీ యాజమాన్యం తెలిసింది. అయితే వారు కాలేజీలో తమ చదువును కొనసాగించవచ్చని పేర్కొంది. బాధిత విద్యార్థులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్వేచ్ఛ ఉన్నదని వివరించింది.
అయితే ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్న సీనియర్లను కేవలం ఆరు నెలలు సస్పెండ్ చేయడం సరిపోదని బాధిత విద్యార్థి వాపోయాడు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతడు డిమాండ్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 1951లో మొట్టమొదట జనగణన.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

