Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Bengaluru techie dies by suicide | ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని ఒక వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి ఆమె కుటుంబం కూడా అంగీకరించింది. అయితే ఆమె వివాహం విఫలమవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నది.
బెంగళూరు: ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని ఒక వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి ఆమె కుటుంబం కూడా అంగీకరించింది. అయితే ఆమె వివాహం విఫలమవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. (Bengaluru techie dies by suicide) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బగలగుంటే ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల విద్యాజ్యోత్, బాష్ సంస్థలో ఐటీ ఉద్యోగిని. కొన్ని రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నది.
కాగా, కొడగు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, విద్యాజ్యోత్ ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడిని విద్యాజ్యోత్ సంప్రదించింది.
అయితే ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం విఫలమవుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. రెండేళ్లకే వారిద్దరూ విడిపోతారని అంచనా వేశాడు. దీనిని అధిగమించేందుకు తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని సూచించాడు.
మరోవైపు జ్యోతిష్కుడి సలహాను విద్యాజ్యోత్ పాటించింది. అతడు చెప్పిన విధంగా పూజలు చేసింది. శుక్రవారం తొమ్మిదో రోజు పూజ కోసం కుటుంబ సభ్యులు గుడికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Rape and Murder | ఒకే రోజు మహిళపై రెండుసార్లు అత్యాచారం.. బిల్డింగ్ పైనుంచి తోసి హత్య
DMK Youth Member Arrested | చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్
Watch: డీజే ఆపేయడంపై గొడవ.. హింసాత్మకంగా మారిన ఘర్షణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

