Watch: డీజే ఆపేయడంపై గొడవ.. హింసాత్మకంగా మారిన ఘర్షణ
Wedding Turns Violent | పెళ్లి వేడుకలో డీజే ఆపేయడంపై వివాదం చెలరేగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో కొందరు వ్యక్తులు తోసుకుని కొట్టుకున్నారు. భయాందోళన చెందిన పెళ్లి అతిథులు దూరంగా పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: పెళ్లి వేడుకలో డీజే ఆపేయడంపై వివాదం చెలరేగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో కొందరు వ్యక్తులు తోసుకుని కొట్టుకున్నారు. భయాందోళన చెందిన పెళ్లి అతిథులు దూరంగా పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Wedding Turns Violent) ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం దిలీప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గెస్ట్ హౌస్‌లో పెళ్లి వేడుక జరిగింది. దేహత్ కొత్వాలి ప్రాంతంలోని మోహన్‌గంజ్ బజార్‌కు చెందిన వరుడు అమిత్ గుప్తా పెళ్లి ఊరేగింపుగా అక్కడకు చేరుకున్నాడు. కొన్ని పెళ్లి తంతులు నిర్వహించారు.
కాగా, విందు తర్వాత రాత్రి 10.30 గంటల సమయం కావడం, విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరుగుతుంన్నందున పోలీసుల ఆంక్షల నేపథ్యంలో డీజే మ్యూజిక్‌ను ఆపరేటర్ ఆపేశాడు. కొందరు వ్యక్తులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీజే ఆపరేటర్‌పై దాడికి వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన కోట్లాట, తోపులాటలో నలుగురు గాయపడ్డారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరితో పాటు గుర్తు తెలియని ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#प्रतापगढ़ में दुल्हन के दरवाजे पर बारात आयी. बाराती नाचने के मूड में थे और लड़कीवाले चाहते थे रस्में हो जाये. लड़कीवालों ने अचानक DJ बंद करा दिया. फिर क्या था दोनों गुटों में जमकर मारपीट हुई.
बारातियों को लड़की वाले पीटते हुए दूर तक ले गये. pic.twitter.com/Tr4bJ86lwy
— Narendra Pratap (@hindipatrakar) February 28, 2026
Also Read:
Woman Rape and Murder | ఒకే రోజు మహిళపై రెండుసార్లు అత్యాచారం.. బిల్డింగ్ పైనుంచి తోసి హత్య
DMK Youth Member Arrested | చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్
IAS Officer Suspended | మంత్రి సమావేశాలకు గైర్హాజరు.. ఐఏఎస్ అధికారి సస్పెండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

