ముంబై: మంత్రి సమావేశాలకు ఐఏఎస్ అధికారి గైర్హాజరయ్యారు. పైగా మీటింగ్‌కు రాబోనని మెసేజ్ పంపారు. ఆ మంత్రి ఇదే విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు. సభ్యుల ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. (IAS Officer Suspended) ఫిబ్రవరి 26న మహారాష్ట్ర అసెంబ్లీలో చంద్రపూర్ జిల్లా కాలుష్యంపై చర్చ జరిగింది. దీనిపై స్పందించాలని రాష్ట్ర పర్యావరణ మంత్రి పంకజ ముండేను సభ కోరింది.
కాగా, కీలక సమాచారం సేకరించేందుకు తాను ఏర్పాటు చేసిన సమావేశాలకు ఐఏఎస్ అధికారి, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి ఎం దేవేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్ సహా సంబంధిత అధికారులు హాజరుకాలేదని బీజేపీ మంత్రి పంకజ ముండే ఆరోపించారు. పలు రిమైండర్లు ఇచ్చినప్పటికీ ఆ అధికారి స్పందించలేదని, సమావేశానికి తాను హాజరు కాబోనని సందేశం పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తగిన సమాచారం లేనందున వివరణాత్మక బ్రీఫింగ్ ఇవ్వలేనని సభకు ఆమె వివరించారు. అలాంటి అధికారుల అవిధేయత ఒక మంత్రి ప్రజలకు సమాధానం చెప్పే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
మరోవైపు ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. మంత్రి సమావేశానికి అధికారుల గైర్హాజరును తీవ్ర నిర్లక్ష్యం, శాసనసభకు అవమానంగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి దేవేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర రాజకీయాలు, అధికారుల్లో ఇది చర్చనీయాంశమైంది.
Also Read:
Nepali Woman Gang Raped | ఆటోలో వెళ్తున్న నేపాల్ మహిళ.. డ్రైవర్‌తో సహా ముగ్గురు సామూహిక అత్యాచారం
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?