IND vs SLXI: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్‌లో జయబేరి మోగించింది. దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్) భారీ శతకంతో కోలుకున్న టీమిండియా ఆపై ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థిని వణికించింది. లంక 2006 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. స్వల్ప ఛేదనలో యశస్వీ జైస్వాల్(61), శుభ్‌మన్ గిల్(44)లు మెరిశారు. ఆఖరి ఓవర్లో సిరాజ్(32 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది.
మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో తొలి రోజు తేలిపోయిన భారత జట్టు అద్భుత విజయం సాధించింది. దేవ్‌దత్ పడిక్కల్(142 నాటౌట్) అజేయ శతకానికి రవీంద్ర జడేజా(61) హాఫ్ సెంచరీ తోడవ్వగా భారీ స్కోర్ కొట్టిన టీమిండియా.. మూడో రోజు 357/6 వద్దే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 6 పరుగుల ఆధిక్యంతో ఆట మొదలెట్టిన లంక ఎక్స్ఐ .. 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Mohammed Siraj with the winning runs 🔥🔥
A successful chase in Colombo for #TeamIndia against SLC XI 👏👏
Scorecard ▶️ https://t.co/g7rdlUUjY2 pic.twitter.com/4rAFzHXWXN
— BCCI (@BCCI) August 9, 2026
లంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(61), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(44)లు శుభారంభమిచ్చారు. రిషభ్ పంత్(28), ధ్రువ్ జురెల్(17)లు విఫలైమనా.. జడేజా(22), సిరాజ్(32 నాటౌట్)లు బ్యాట్ ఝులిపించారు. దాంతో, గిల్ సేన6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది.
రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహక మ్యాచ్‌లో భారత జట్టు ఆదిలో తడబడినా చివరకు నిలబడింది. మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా(142 నాటౌట్) భారీ శతకంతో రెచ్చిపోయాడు. కేఎల్ రాహుల్(41), రవీంద్ర జడేజా(63 రిటైర్డ్ హర్ట్)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పడిక్కల్.. ఆఖరి ఓవర్ వరకూ క్రీజునంటుకుపోయాడు.

మానవ్ సుతార్(41) సైతం గొప్పగా ఆడడంతో టీమిండియాను ఆలౌట్ చేయాలనుకున్న లంక బౌలర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఓవర్‌నైట్ స్కోర్ 357/6తో రెండో రోజు ఆటను ముగించిన భారత్.. మూడోరోజు తొలి బంతికి ముందే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 363-8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.