Hair Care | వానలో తడిసిన వెంటనే జుట్టు జిడ్డుగా మారుతోందా? కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటించండి!
Hair Care ఁ వానలో తడిసి ఇంటికి తిరిగి వచ్చేసరికి స్కాల్ప్ జిడ్డుగా, బంకగా మారిపోతుంది. మహా చికాకు పెట్టేస్తుంది. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని, పరిష్కార మార్గాలు అన్వేషిస్తే..
Hair Care | వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం చాలాకష్టంగా ఉంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఓ చిన్నపాటి వర్షం అంతా చెడగొట్టేస్తుంది. వానలో తడిసి ఇంటికి తిరిగి వచ్చేసరికి స్కాల్ప్ జిడ్డుగా, బంకగా మారిపోతుంది. మహా చికాకు పెట్టేస్తుంది. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని, పరిష్కార మార్గాలు అన్వేషిస్తే..
వర్షంలో తడిసినప్పుడు జుట్టు మొత్తం కిందికి అణిగిపోతుంది. దాంతో వెంట్రుకలు తమ ఒత్తయిన రూపు కోల్పోయి.. మాడుపై ఉండే సహజసిద్ధమైన నూనెలు బయటికి కనిపిస్తాయి. అందువల్లే.. జుట్టు జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, భారీ వర్షం పడిన తర్వాత కూడా విపరీతంగా చెమట పడుతుంది. ఈ చెమట.. మాడుపై ఉండే సహజ నూనెలతో కలిసి జుట్టును బరువుగా, జిడ్డుగా మార్చేస్తుంది. వర్షపు నీటిలో ఎన్నో రకాల కాలుష్య కారకాలు కలుస్తాయి. ఇవి జుట్టుకు అంటుకోవడం వల్ల జుట్టు మురికిగా తయారవుతుంది.
అంతేకాకుండా.. కొన్నిరకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు పొడి జుట్టుపై మాత్రమే వాడాల్సి ఉంటుంది. వర్షం నీటిలో తడిసినప్పుడు.. ఆయా ప్రొడక్ట్స్ మళ్లీ యాక్టివేట్ అవుతాయి. దాంతో మాడు మామూలు కన్నా ఎక్కువ బంకగా మారిపోతుంది. మొత్తానికి తలస్నానం చేసి, జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఉత్పత్తులు వాడినా.. ఓ చిన్న వర్షంతో నెత్తి మొత్తం జిడ్డుగా తయారవుతుంది. ఈ సమస్యను నివారించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
- వర్షాకాలంలో జెల్స్, వ్యాక్స్, డ్రై షాంపూలు, లీవ్-ఇన్ కండిషనర్ల వాడకాన్ని తగ్గించండి. ఇవి గాలిలోని తేమను పీల్చుకుని, జుట్టును మరింత బంకగా మారుస్తాయి.
- వర్షంలో తడిస్తే వెంటనే తలస్నానం చేయండి. దాంతో వర్షపు నీటిలోని కాలుష్య కారకాలు వదిలిపోయి, మాడు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉంటుంది.
- వర్షాకాలంలో మాడుపై చెమట, జిడ్డు ఎక్కువగా చేరుతుంది. కాబట్టి వారానికి రెండుమూడు సార్లు మైల్డ్ లేదా క్లారిఫైయింగ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇది మాడును శుభ్రంగా, పొడిగా ఉంచుతుంది.
- జుట్టును లూజ్‌గా వదిలేస్తే.. అది గాలిలోని తేమను త్వరగా పీల్చుకుని ఉబ్బిపోతుంది. అందుకే, ఈ కాలంలో జుట్టును లూజ్ జడలా అల్లుకోవడం మంచిది.
- జిడ్డుగా ఉన్న జుట్టును దువ్వడం వల్ల దువ్వెనలకు కూడా బ్యాక్టీరియా, జిడ్డు అంటుకుంటుంది. కాబట్టి, మీ దువ్వెనలను వారానికి ఒకసారి వేడినీటితో శుభ్రం చేయండి. అలాగే, జుట్టు చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనలను మాత్రమే వాడండి.
- అన్నిటికన్నా ముఖ్యంగా.. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు లేదా నెత్తిని కప్పి ఉంచే హుడీని వేసుకోండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

