‘కాంట్రాక్టు కార్మికులు బానిసలు కాదు’
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పిచ్చేటి శివ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారనే భావన..
– సీఐటీయూ ఏరియా ప్రధాన కార్యదర్శి పిచ్చేటి శివ
రుద్రంపూర్, సెప్టెంబర్ 15 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పిచ్చేటి శివ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారనే భావన వారిలో నెలకొంటోందని, ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సీఐటీయూ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీపింగ్, స్కావెంజింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పని వేళల్లో చిన్న తప్పులు జరిగినా ఆబ్సెంట్ వేస్తున్నారని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.
ఈ సందర్భంగా పిచ్చేటి శివ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులు యంత్రాలు కాదని, మనుషులనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. కార్మికులపై ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్మికుల శ్రమను గుర్తించి, వారికి గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ బుక్య రమేష్, ట్రెజరర్ ప్రమోద్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

