ఖమ్మం రూరల్లో 205 గణేష్ మండపాలు
ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలలో కలిపి మొత్తం సుమారుగా 205 గణేష్ మండపాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే...
– తీర్థల, దంసలాపురం జలాశయంలో నిమజ్జన వేడుకలు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 15 : ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలలో కలిపి మొత్తం సుమారుగా 205 గణేష్ మండపాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సంబంధిత అధికారులు 185 మండపాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరో 20 మండపాలు ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం మండలంలో మొత్తం 180 గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు, ఆశించిన మేర మున్నేరు వాగులో నీటి నిల్వలు లేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఖమ్మం రూరల్ మండలం తీర్థల వద్ద మున్నేరు వాగులో ఒక ఘాటు, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం జలాశయంలో మరో ఘాట్ను ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ఆరంభమయ్యాయి. ఊరువాడ అని తేడా లేకుండా గల్లి గల్లి లో గణేష్ వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రి వేడుకల నుండి మొదలు నిమజ్జన ప్రక్రియ ముగిసిన వరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు అధికారులకు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు పోలీస్ అధికారులు నిర్వాహకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఖమ్మం రూరల్లో 205 గణేష్ మండపాలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

