VVS Laxman | బీసీసీఐ, భారత మేనేజ్మెంట్తో అంతరం లేదు.. ఆటగాళ్ల పురోగతిపై చర్చిస్తూనే ఉంటాం..!
VVS Laxman | బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాంతో, బీసీసీఐ అత్యవసర సమీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
VVS Laxman : భారత క్రికెటర్లు తరచూ గాయపడడం, త్వరగా కోలుకోకపోవడం జట్టు కూర్పును దెబ్బతీస్తున్నాయి. ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుండడంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాంతో, బీసీసీఐ అత్యవసర సమీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ, భారత మేనేజ్మెంట్తో తమకు సత్సంబంధాలే ఉన్నాయని, తరచూ మాట్లాడుకుంటామని లక్ష్మణ్ వెల్లడించాడు.
ఇటీవల కాలంలో విదేశీ పర్యటనకు భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరిన వాళ్లు.. త్వరగా కోలుకోవడం లేదు. పునరాగమనం చేసినా మళ్లీ గాయాలతో సీఓఈ గూటికి చేరుతున్నారు. దాంతో, సీఈఓకి బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య అంతరం ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఈఓ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. కమ్యూనికేషన్ గ్యాప్ లేనేలేదని స్పష్టం చేశాడు.
No miscommunication between BCCI, CoE and Indian team management, says Laxman 🗣️
🔗 https://t.co/FwsBG6ehqa pic.twitter.com/VkzSGAEnyt
— Cricinfo (@cricinfo) August 9, 2026
‘భారత మేనేజ్మెంట్(మహిళలు, పురుషుల జట్లు), స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెలెక్టన్ కమిటీల మధ్య పరస్పర పహకారం చాలా బాగుంది. ఎలాంటి అవాంతరాలు లేవు. సీఓఈలో ఆటగాళ్లు కోలుకోవడం ఆసల్యం అవుతుంటే.. అసలు ఏం జరుగుతోంది? అనేది చీఫ్ సెలెక్టర్, హెడ్కోచ్లతో మాట్లాడిన అవసరముంది. కోలుకుంటున్న క్రికెటర్లు శ్రీలంక సిరీస్‌లో ఆడేందుకు సిద్ధంగా లేరు. రికవరీ అనేది ఆటగాళ్లు, జట్టుకు సంబంధించినది. కాబట్టి.. మా మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- bumrah
- CoE
- Rehabilitation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

