Dhee Pandu | రోడ్డు ప్రమాదం తర్వాత పండు మాస్టర్ కీలక నిర్ణయం.. బెడ్పైనుంచే కొత్త ప్రయాణం మొదలు!
Dhee Pandu | బుల్లితెరపై తనదైన డ్యాన్స్, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం పండు కదల్లేని పరిస్థితిలో బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Dhee Pandu | బుల్లితెరపై తనదైన డ్యాన్స్, కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం పండు కదల్లేని పరిస్థితిలో బెడ్‌పైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ మునుపటిలా డ్యాన్స్ చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఆయన స్టేజ్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా బుల్లితెర కళాకారులకు వరుసగా కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఉంటేనే ఆదాయం వస్తుంటుంది. అయితే ప్రస్తుతం నిలబడే పరిస్థితి కూడా లేకపోవడంతో పండుకు కొంతకాలం పాటు పనులకు దూరంగా ఉండాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో పండు మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించిన ఆయన.. ఇకపై సొంతంగా ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి, చికిత్స, కోలుకునే ప్రక్రియతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఈ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకోనున్నారు. బెడ్‌పైనే ఉంటూ పండు మాస్టర్ ప్రత్యేకంగా ఒక వీడియోను చిత్రీకరించారు. ఇన్నాళ్లూ తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ.. ఇకపై తనకు సంబంధించిన తాజా వివరాలను యూట్యూబ్‌లో పంచుకోబోతున్నట్లు తెలిపారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్నాళ్లూ అభిమానులను అలరించానని, ఇక నుంచి తన ఆరోగ్య పరిస్థితి, ఇతర విశేషాలకు సంబంధించిన నవీకరణలను యూట్యూబ్‌లో అందిస్తానని చెప్పారు. తన కొత్త ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, తనకు అండగా నిలవాలని అభిమానులను కోరారు. ప్రస్తుతం పండు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆదాయానికి కొంత ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడటంతో పాటు తన అభిమానులతో నిరంతరం అనుసంధానంగా ఉండేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. పండు మాస్టర్ కెరీర్ ‘ఢీ’ కార్యక్రమంతోనే మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట సాధారణ డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. తన ప్రతిభ, కష్టంతో కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా ‘నక్కిలీసు గొలుసు’ పాటతో పండుకు ఒక్కసారిగా భారీ క్రేజ్ వచ్చింది. తన ప్రత్యేకమైన డ్యాన్స్ శైలి, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఆ తర్వాత పలు ప్రముఖ బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Accident
- channel
- dhee
- pandu master
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

