Bhogi | శర్వానంద్–డింపుల్ హయాతి క్లోజ్ వీడియో వైరల్.. కొత్త రూమర్స్‌కు తెరలేపిన ‘భోగి’ వేడుక!
Bhogi | టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదలకు సిద్ధమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు
Bhogi | టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదలకు సిద్ధమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే సినిమా ప్రమోషన్ కార్యక్రమం కంటే శర్వానంద్, డింపుల్ హయాతి మధ్య జరిగిన ఆత్మీయ పలకరింపు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ‘భోగి’ ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్‌ను చూసిన డింపుల్ హయాతి ఎంతో చనువుగా పలకరించారు. ఆయనను హత్తుకుని, భుజంపై తల ఆనిస్తూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య కనిపించిన ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లలో హీరోహీరోయిన్లు సరదాగా మాట్లాడుకోవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం సాధారణమే అయినప్పటికీ.. శర్వానంద్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వీడియోకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, శర్వానంద్ 2023 జూన్ 3న రక్షితా రెడ్డిని జైపూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2024లో ఓ కుమార్తె జన్మించింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, విడివిడిగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా శర్వానంద్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను తొలగించారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. దీంతో వీరి వైవాహిక జీవితంపై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై శర్వానంద్ లేదా ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించి స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా ‘భోగి’ ప్రీ రిలీజ్ వేడుకలో డింపుల్ హయాతి శర్వానంద్‌ను ఆప్యాయంగా పలకరించడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీరిద్దరూ సినిమాలో కలిసి నటిస్తున్న నేపథ్యంలో షూటింగ్ సమయంలో మంచి స్నేహం ఏర్పడి ఉండొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వేడుకలో కనిపించిన ఆ క్షణాలను కొందరు నెటిజన్లు వేరే కోణంలో చూస్తూ కామెంట్లు చేస్తున్నప్పటికీ, సహనటుల మధ్య ఉండే స్నేహపూర్వక పలకరింపును అనవసరంగా వివాదం చేయొద్దని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో ఆధారంగా ఎలాంటి వ్యక్తిగత సంబంధాలపై నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
#Sharwanand & #DimpleHayathi #Bhogi Pre Release event! https://t.co/Yb1FEXHUYV
— AnantapurBO (@AnantapurBO) November 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi | శర్వానంద్–డింపుల్ హయాతి క్లోజ్ వీడియో వైరల్.. కొత్త రూమర్స్‌కు తెరలేపిన ‘భోగి’ వేడుక!
ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
Nidhhi Agerwal | అందాల నిధి అదిరిపోయే లుక్.. పర్పుల్ శారీలో మైమరిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
Grama Sabha | విశ్వనాథపల్లిలో బుగ్గవాగు ప్రాజెక్టుపై గ్రామసభ
గోదావరిఖనిలో అర్ధరాత్రి యువకుని హత్య.. పథకం ప్రకారం పిలిపించి హతం
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

