Nepali Woman Gang Raped | ఆటోలో వెళ్తున్న నేపాల్ మహిళ.. డ్రైవర్‌తో సహా ముగ్గురు సామూహిక అత్యాచారం
Nepali Woman Gang Raped | నేపాల్‌కు చెందిన మహిళ తన ఫ్రెండ్‌ను కలవలేకపోవడంతో నిరాశ చెందింది. మద్యం సేవించిన ఆమె ఆటోలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్, మరో ఇద్దరు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
చండీగఢ్: నేపాల్‌కు చెందిన మహిళ తన ఫ్రెండ్‌ను కలవలేకపోవడంతో నిరాశ చెందింది. మద్యం సేవించిన ఆమె ఆటోలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్, మరో ఇద్దరు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Nepali Woman Gang Raped) హర్యానాలో ఈ సంఘటన జరిగింది. నేపాల్ పౌరురాలైన 26 ఏళ్ల మహిళ కురుక్షేత్రలో నివసిస్తూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. ఫిబ్రవరి 24న ఫ్రెండ్‌ను కలిసిసేందుకు గురుగ్రామ్ చేరుకున్నది. ఫ్రెండ్‌ను కలవలేకపోవడంతో నిరాశ చెందిన ఆమె మద్యం సేవించింది.
కాగా, నేపాల్ మహిళ కురుక్షేత్రకు తిరిగి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించింది. అయితే ఆమె మద్యం మత్తులో ఉండటాన్ని డ్రైవర్, ఆటోలోని వ్యక్తులు గమనించారు. నహర్పూర్ రూపా ప్రాంతంలోని ఒక గదికి ఆ మహిళను తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు నేపాల్ మహిళ గ్రహించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Police Trainees Reel | రీల్ తెచ్చిన చిక్కులు.. ఆరుగురు ట్రైనీ పోలీసులకు షోకాజ్ నోటీసులు
Anna Hazare | లిక్కర్ పాలసీపై కోర్టు తీర్పును అంగీకరించాలి: అన్నా హజారే
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

