Police Trainees Reel | రీల్ తెచ్చిన చిక్కులు.. ఆరుగురు ట్రైనీ పోలీసులకు షోకాజ్ నోటీసులు
Police Trainees Reel | కానిస్టేబుల్స్‌గా కొత్తగా నియమితులైన పోలీసులు శిక్షణ పొందుతున్నారు. అయితే పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఆరుగురు ట్రైనీలు రీల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
భోపాల్: కానిస్టేబుల్స్‌గా కొత్తగా నియమితులైన పోలీసులు శిక్షణ పొందుతున్నారు. అయితే పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఆరుగురు ట్రైనీలు రీల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Police Trainees Reel) ఈ నేపథ్యంలో వారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రేవాలోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్ తీశారు. యూనిఫాంలో ఉన్న యువ పోలీసులు జోకులు వేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే ఏం? నాకు నెలవారీ జీతం వస్తుంది. నాకు ఎక్కువ బట్టలు లేకపోతే ఏం? నాకు యూనిఫాం ఉంది’ అని వారు అన్నారు.
కాగా, ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ట్రైనీ పోలీసుల రీల్‌ను కొందరు ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది.
మరోవైపు పోలీస్ యూనిఫాం ధరించి రీల్ చేయడాన్ని పోలీస్ శాఖ తప్పుపట్టింది. నియమ నిబంధనలు, క్రమశిక్షణను ఆ ట్రైనీ పోలీసులు ఉల్లంఘించినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు పేర్కొంది. ప్రతిస్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
🚨 बड़े दुःख के साथ सूचित कर रहा हूं,
सिपाही द्वारा वर्दी में रील बनाने पर पुलिस विभाग ने इन सभी के खिलाफ अनुशासनात्मक कारवाई करने का नोटिस इनको भेज दिया है। pic.twitter.com/sLYaVgLyk0
— मटियामेट (@matiyamet_) February 26, 2026
Also Read:
Anna Hazare | లిక్కర్ పాలసీపై కోర్టు తీర్పును అంగీకరించాలి: అన్నా హజారే
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Students Chain Snatching | మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.. మెడికల్ కాలేజీ విద్యార్థులు అరెస్ట్
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

