Students Chain Snatching | మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.. మెడికల్ కాలేజీ విద్యార్థులు అరెస్ట్
Students Chain Snatching | మెడికల్ కాలేజీ విద్యార్థులు నేరబాట పట్టారు. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు, ఆమె మొబైల్ ఫోన్ చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక యువతి ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు.
డెహ్రాడూన్: మెడికల్ కాలేజీ విద్యార్థులు నేరబాట పట్టారు. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు, ఆమె మొబైల్ ఫోన్ చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక యువతి ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. (Students Chain Snatching) ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 25న జౌల్జిబి ప్రాంతంలో ఒక మహిళ పనికి వెళ్తుండగా యువతి, ఆమె స్నేహితుడు అడ్డుకున్నారు. ఆమె మెడలోని గోల్డ్ చైన్‌తో పాటు మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు.
కాగా, బాధిత మహిళ మమతా దేవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హల్ద్వానీలోని సుశీల తివారీ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులను నిందితులుగా గుర్తించారు. టోలి గ్రామానికి చెందిన 23 ఏళ్ల హిమాని బోరా, ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల సన్నీ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు రేడియాలజీ చదువుతున్న విద్యార్థిని హిమాని, సహ విద్యార్థి సన్నీ సింగ్‌ను తన గ్రామానికి తీసుకెళ్లిందని పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ వీరిద్దరూ కలిసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు చెప్పారు. గోరి నది వంతెన సమీపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు వివరించారు.
Also Read:
Kolkata Earthquake | కోల్‌కతాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్లను వీడిన జనం
self-styled godman kisses Girl | దేవుడిగా చెప్పుకునే వ్యక్తి బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
Watch: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి.. వ్యక్తిపై తొండంతో దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

