RTC Driver | రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్‌కు రూ.50 లక్షల చెక్కు అందజేత
RTC Driver | రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎం.డి. మాదర్ కు ఆర్టీసీ యాజమాన్యం అండగా నిలిచింది.
జగిత్యాల : రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎం.డి. మాదర్ ( MD Madhar ) కు ఆర్టీసీ ( RTC ) యాజమాన్యం అండగా నిలిచింది. యూబీఐ (UBI) పథకం కింద ప్రమాద బీమా పరిహారంగా రూ.50 లక్షల చెక్కును( Cheque ) అందజేశారు.
కోరుట్ల డిపోకు చెందిన డ్రైవర్ ఎం.డి. మాదర్ గత అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన కుడి కాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో యూబీఐ పథకం కింద లభించిన ప్రమాద బీమా ప్రయోజనంలో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం రూ.50 లక్షల చెక్కును అందజేసింది. ఈ మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి , యూపీఐ బ్యాంక్ సీజీఎం ఎం రవీంద్రబాబు, డీజిఎం ఎన్ సత్యనారాయణ బాబ్జి , ఏజీఎం రంజన్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో బాధిత డ్రైవర్ ఎం.డి. మాదర్కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన తనకు యూబీఐ పథకం ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఆర్టీసీ యాజమాన్యా నికి డ్రైవర్ ఎం.డి. మాదర్ , కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి సోలోమన్, సిహెచ్ వెంకన్న, ఎం.రాజశేఖర్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు , కోరుట్ల డిపో మేనేజర్ ఎన్. మనోహర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

