ముంబై: ఒక పాల ట్యాంకర్ రోడ్డుపై బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్‌లోని పాలు ధారగా ఒలికిపోయాయి. గమనించిన స్థానికులు బాటిల్స్‌లో పాలు నింపుకునేందుకు ఎగబడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Milk Tanker Overturns) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక పాల ట్యాంకర్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకు బయలుదేరింది. అయితే సోమవారం ఉదయం దహాను తాలూకాలోని తవా గ్రామం సమీపంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అది బోల్తాపడింది.
కాగా, ప్రమాదం ధాటికి ట్యాంకర్‌లోని పాలు లీక్ అయ్యాయి. వందలాది లీటర్ల పాలు నేలపాలయ్యాయి. రోడ్డుపై ఒలికిపోయాయి. దీంతో పాల నదిలా అక్కడ కనిపించింది. గమనించిన స్థానికులు సీసాలు, డబ్బాలతో అక్కడకు చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి ఒలికిపోతున్న పాలను వాటిల్లో నింపుకున్నారు.
మరోవైపు ఈ ప్రమాదం కారణంగా ఆ జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు కొంతసేపు అంతయారం ఏర్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ట్యాంకర్ నుంచి ఒలికిపోతున్న పాలను స్థానికులు బాటిల్స్, టిన్స్‌లో నింపుకున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Video: Milk Flows On Highway After Tanker Overturns In Maharashtra pic.twitter.com/Ug9XtH4DUL
— NDTV (@ndtv) September 21, 2026