ఆయనతో పనిచేయడం ఓ పీడకల!
బాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుపోతుంటుంది కథానాయిక దియా మీర్జా. అయితే ఆమె సోషల్‌మీడియా వేదికగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుపోతుంటుంది కథానాయిక దియా మీర్జా. అయితే ఆమె సోషల్‌మీడియా వేదికగా నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నవాజుద్దీన్ సిద్ధిఖీని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది దియా మీర్జా. ‘ఆయనతో కలిసి పనిచేయడం పీడకల లాంటిది. ఏమాత్రం మాట్లాడే విధానం తెలియదు. ఇక ఆటిట్యూడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తిత్వం’ అంటూ దియా మీర్జా తన పోస్ట్‌లో పేర్కొన్నది.
కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఘాటుగా స్పందించారు. ఆటిట్యూడ్ గురించి మాట్లాడటం చాలా సులభమని, తన పనిలో తప్పులుంటే వెతికి చూపించాలని కౌంటర్ ఇచ్చారు. ఆయన సమాధానం కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరిద్దరి వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ కలిసి నటిస్తున్న ‘డాక్టర్ హసన్’ అనే వెబ్‌సిరీస్ ప్రచారంలో భాగంగా కావాలనే ఈ వివాదాన్ని సృష్టించారని అంటున్నారు. దియా మీర్జా వివాదాల జోలికి వెళ్లదని, ఇదంతా ప్రమోషన్లో భాగమేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో పాపులర్ అయిన మెడికల్ డ్రామా ‘హౌస్ ఎం.డి’ ఆధారంగా ‘డాక్టర్ హసన్’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

