పింఛన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామా!
పింఛన్ల పండుగ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియాతో సమావేశంలో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ గణాంకాలు, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
- మూడేండ్లలో ఒక్క కొత్తపింఛనూ ఇవ్వలేదు
- పాతవి తొలగించి..కొత్తవి ఇస్తున్నట్టు ప్రగల్భాలు
- గణాంకాలతో వివరాలువెల్లడించిన మాజీమంత్రి వేముల
నిజామాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పింఛన్ల పండుగ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియాతో సమావేశంలో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ గణాంకాలు, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గడిచిన మూడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. 2023, డిసెంబర్ నాటికి కేసీఆర్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల 79వేల 177 మందికి రూ.2,016 చొప్పున పింఛన్ అందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో 17,131 మంది పింఛన్లను తొలగించి, కొత్తగా 20,555 మందికి మంజూరు చేసినట్టు కాకి లెక్కలు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. తొలగించిన స్థానంలోనే కొత్తవారిని భర్తీ చేయడం ద్వారా నికరంగా పెరిగిన పింఛన్లు 3,424 పింఛన్లు మాత్రమేనని పేర్కొన్నారు. బెజ్జోరలో 22 మంది పింఛన్లు తొలగించి.. కొత్తగా 13 మందికి ఇస్తూ గ్రామ పంచాయతీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని డీపీవో నుంచి ఆదేశాలు రావడం విడ్డూరంగా మారిందని ఎద్దేవా చేశారు.
సీతక్క, పీసీసీ చీఫ్‌కు బహిరంగ సవాల్..
తాను వెల్లడించిన గణాంకాలలో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని వేముల సవాల్ విసిరారు. తాను చెప్పిందే నిజమైతే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మూడేండ్లుగా నిజామాబాద్ జిల్లాలో ఒంటరి మహిళలలతో పాటు 57 ఏళ్లు నిండిన 40వేల మంది వృద్ధులు, కొత్తగా పైండ్లె కాపురానికి వచ్చిన 30వేల మంది బీడీ కార్మికులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి హామీ కోసం లక్షలాది మంది ఆడబిడ్డలు నిరీక్షిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛన్ ఇస్తామని చెప్పి 36 నెలలు గడిచినా నేటికీ రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. హామీలు, బకాయిలు చెల్లించకుండా కేవలం చనిపోయిన వారి స్థానంలో కొద్ది మందికి పింఛన్లు ఇస్తూ పండుగ పేరుతో సమావేశాలు నిర్వహిస్తే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, మంత్రి అని చెప్పుకుంటున్న సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలే ఎక్కడికక్కడ నిలదీసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బాజిరెడ్డి జగన్, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంఎస్ మాజీ ఛైర్మన్ దొంకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

