రెరా.. ఇది తగునా?
రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హకులను పరిరక్షించాల్సిన తెలంగాణ రేరా తీరు పలు విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న బడా సంస్థల జోలికి వెళ్లకుండా, చిన్న జలగలపై కొరడా ఝుళిపిస్తూ కంటి తుడుపు చర్యలతో నెట్టుకొస్తుంది.
- నిబంధనలు ఉల్లంఘించినా..బడాసంస్థల జోలికి వెళ్లని వైనం
- చిన్న సంస్థలకు జరిమానాలతో సరి
- రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హకులను పరిరక్షించాల్సిన తెలంగాణ రేరా తీరు పలు విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న బడా సంస్థల జోలికి వెళ్లకుండా, చిన్న జలగలపై కొరడా ఝుళిపిస్తూ కంటి తుడుపు చర్యలతో నెట్టుకొస్తుంది. రియల్ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడుతూ, కొనుగోలుదారుల సొమ్ముకు భరోసా లేకుండా సంస్థలపై చిన్నచిన్న జరిమానాలతో సరిపెడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మను జలగల్లా పీల్చి, ఒప్పందం ప్రకారం ఆస్తులపై హక్కులు కల్పించకుండా ఇబ్బందిపెడుతున్న ‘సాస్ ఇన్ఫ్రా’ లాంటి పెద్ద సంస్థల అక్రమాల పుట్టను తాకడమే లేదు. వరుసగా రెండోసారి పలు రియాల్టీ సంస్థలపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా… రెండో పర్యాయంలోనూ సాస్ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.
జరిమానాలకే పరిమితమవుతున్నఆదేశాలు..!
ఇటీవలి కాలంలో రెరా వెలువరించిన వివిధ తీర్పులను పరిశీలిస్తే.. రియల్ రంగంలో అనేక ప్రాజెక్టుల్లో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కఠినమైన చట్టపరమైన చర్యలకు బదులుగా కేవలం జరిమానాలు, నామమాత్రపు రీఫండ్ ఆదేశాలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్న ఓ సంస్థకు సంబంధించి ముకు పిండి డబ్బులు వసూలు చేయడంలో రెరా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. ఇలా బడా వ్యాపార సంస్థల బలప్రయోగాన్ని ఎందుకు ఎదురించలేకపోతుందనీ అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
సాస్ పుట్టను తాకని రెరా
నిబంధనలను కాలరాసి, వందల కోట్ల అక్రమాలకు పాల్పడిన ‘సాస్ ఇన్ఫ్రా’ లాంటి భారీ సంస్థల జోలికి రెరా వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రియల్ రంగంలో జరుగుతున్న కోట్ల రూపాయల అవకతవకలను అరికట్టడంలో రెరా అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారనే వాదనలు బలపడుతున్నాయి. కేవలం కాగితాలపై ఇస్తున్న తీర్పులు, నామమాత్రపు పెనాల్టీలు అక్రమారులకు భయాన్ని కలిగించలేకపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెరా కేవలం కంటితుడుపు చర్యలను విడనాడి, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ పెద్ద ప్రాజెక్టుల అక్రమాలపై ఉకుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

శాండ్ స్టోన్ ఇన్ఫ్రా (జస్విత ఎస్టేట్స్):
శంకర్పల్లిలోని ఈ ప్రాజెక్టులో రూ.47లక్షలు వసూలు చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోగా, బాధితుడికి ఇవ్వాల్సిన చెకులు కూడా చెల్లడం లేదు. దీనిపై కేవలం వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశించడమే తప్ప, మోసానికి పాల్పడిన యాజమాన్యంపై క్రిమినల్ చర్యలకు పటిష్టమైన అడుగులు పడలేదన్న వాదన ఉంది.
గూగీ ప్రాపర్టీస్, బీవీఆర్ ఇన్ఫ్రా:
అనుమతులు లేకున్నా, రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలో రెరా జరిమానాలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అనధికార వెంచర్లు, బడా నిర్మాణ సంస్థల అక్రమ దందాలకు దీనితో అడ్డుకట్ట పడుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
రాకెట్రీ విల్లా ప్రాజెక్ట్ (ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా):
పోచారంలోని ఈ ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.95లక్షలకు పైగా వసూలు చేసినా, రిజిస్టర్డ్ సేల్ డీడ్ పేరుతో చేతులు దులుపుకుంటూ కొనుగోలుదారులను సివిల్ కోర్టులను ఆశ్రయించాలంటూ రెరా చేతులెత్తేయడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

