Viral News | చెరువు మధ్యలో కారు పెట్టుకుని, ఫుల్లుగా మద్యం తాగి మత్తులోకి.. భారీ వర్షంతో నిండిన చెరువు.. తర్వాత ఏమైందంటే.. Video
Viral News | పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. కొందరికి వింతవింత ఆలోచనలు వస్తుంటాయి. సరిగ్గా అలాంటి వింత, విచిత్ర ఆలోచనే తమిళనాడు (Tamil Nadu) లోని ఇద్దరు యువకులకు వచ్చింది. అయితే ఆ ఆలోచనే వారిని చావు దగ్గరికి వరకు తీసుకెళ్లింది. ధర్మపురి జిల్లా (Dharmapuram district) మారండహళ్లి (Marandahalli) సమీపంలోని కుమారచెట్టి గ్రామం (Kumarachetti Village) లో ఈ నెల 20 న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral News : పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. కొందరికి వింతవింత ఆలోచనలు వస్తుంటాయి. సరిగ్గా అలాంటి వింత, విచిత్ర ఆలోచనే తమిళనాడు (Tamil Nadu) లోని ఇద్దరు యువకులకు వచ్చింది. అయితే ఆ ఆలోచనే వారిని చావు దగ్గరికి వరకు తీసుకెళ్లింది. ధర్మపురి జిల్లా (Dharmapuram district) మారండహళ్లి (Marandahalli) సమీపంలోని కుమారచెట్టి గ్రామం (Kumarachetti Village) లో ఈ నెల 20 న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్నేహితులైన ఇద్దరు యువకులు థార్ వాహనంలో గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో చెరువులో నీరు తక్కువగా ఉండటంతో నీళ్ల మధ్యలో వాహనం పెట్టుకుని మద్యం సేవించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే వాహనాన్ని నేరుగా నీళ్లలోపలికి నడుపుకెళ్లారు. అక్కడే ఫుల్లుగా మద్యం తాగారు. మత్తు ఆవహించడంతో ఆ వాహనంలోనే నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దాంతో చెరువులోకి వరదనీరు చేరి నీటిమట్టం పెరిగింది. నీళ్లు తగలడంతో మత్తు నుంచి తేరుకున్న యువకులు భయంతో జీపుపైకి ఎక్కి సాయం కోసం పెడబొబ్బలు పెట్టారు.
వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పొక్లెయిన్ సహాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు. వాహనానికి తాళ్లు కట్టి ఒడ్డుకు ఈడ్చుకొచ్చారు. ఈ ఘటనలో యువకులకు ఎలాంటి అపాయం జరగలేదు. ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుల పేర్లు, ఇతర వివరాలు బయటకు వెల్లడించలేదు.
ஏரிக்குள் ஜீப்பை நிறுத்தி குடித்துவிட்டு தூங்கிய 2 பேர்! நள்ளிரவில் நடந்த அதிர்ச்சி…! | Dharmapuri | Jeep | Issue#Dharmapuri #Jeep #Issue #MadhimugamTV pic.twitter.com/ps9qTTgfBz
— Madhimugam TV (@madhimugam_tv) September 22, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

