Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
Viral news | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో అన్నాచెల్లెళ్ల బంధాన్ని అపహాస్యం చేసే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఓ వ్యక్తికి అన్నా అంటూ మూడేళ్లుగా రాఖీ (Rakhi) కట్టి ఆఖరికి అతడితోనే లేచిపోయింది. పవిత్రమైన అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా భావించే రాఖీ పండుగ (Rakhi fest) విశిష్టతను ఆ ఇద్దరూ అపహాస్యం చేశారు.
Viral news : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో అన్నాచెల్లెళ్ల బంధాన్ని అపహాస్యం చేసే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఓ వ్యక్తికి అన్నా అంటూ మూడేళ్లుగా రాఖీ (Rakhi) కట్టి ఆఖరికి అతడితోనే లేచిపోయింది. పవిత్రమైన అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా భావించే రాఖీ పండుగ (Rakhi fest) విశిష్టతను ఆ ఇద్దరూ అపహాస్యం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్ల (Netizens) మధ్య చర్చకు దారితీసింది. ఆ ఇద్దరిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈసా నగర్కు చెందిన ఓ మహిళ తన భర్త స్నేహితుడిని సొంత అన్నలా భావించినట్లు నటించింది. వరుసగా మూడేళ్లపాటు అతడికి రాఖీ కడుతూ వచ్చింది. అయితే చివరాఖరికి అందరికీ షాకిస్తూ ఆమె అదే వ్యక్తితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. భర్తకు దగ్గరి స్నేహితుడిని ‘అన్న’ అని పిలుస్తూ రాఖీ కట్టిన మహిళ ఆఖరికి ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని ఇంత అపహాస్యం చేయడం సరికాదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది. మహిళ కుటుంబసభ్యులు కూడా దీనిపై స్పందించలేదు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

