తిరువనంతపురం: ఆలయ ఉత్సవంలో ఏనుగు అలజడి సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడి చేసింది. తొండంతో అతడి కాళ్లు పట్టుకున్నది. తలకిందులుగా గాల్లోకి ఎత్తి నేలకేసి బాదింది. ఈ నేపథ్యంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Elephant Lifts , Hurls Man) కేరళలోని త్రిస్సూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆలయ ఉత్సవంలో భాగంగా దేవుడి ప్రభను ఏనుగుపై ఊరేగించేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఒక వ్యక్తి ఏనుగుపైకి ఎక్కాడు.
కాగా, దేవుడి ప్రభను పట్టుకుని నిల్చొన్న వ్యక్తిపై ఆ ఏనుగు దాడి చేసింది. ఊహించని విధంగా తొండంతో అతడి కాళ్లు పట్టుకున్నది. తలకిందులుగా గాల్లోకి ఎత్తి నేలకేసి బాదింది. ఇది చూసి పూజారులు, భక్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీయడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మావటి వాళ్లు అతికష్టం మీద ఆ ఏనుగును అదుపుచేశారు.
మరోవైపు ఏనుగు దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సంఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ ఉత్సవాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అయితే వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking incident from Thrissur, Kerala 😳
An elephant picked up a young man and hurled him during a temple festival.
He is now critically injured. pic.twitter.com/TypJh15lR2
— Hinduism_and_Science (@Hinduism_sci) February 26, 2026
Also Read:
self-styled godman kisses Girl | దేవుడిగా చెప్పుకునే వ్యక్తి బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన, దాడి.. కేరళ మంత్రికి గాయాలు