బెంగళూరు: తనను తాను దేవుడిగా చెప్పుకునే వ్యక్తి ఒక బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఎదుటే ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. ఆ బాలిక అసౌకర్యంగా కనిపించినట్లు పిల్లల సంరక్షణ కమిటీ గుర్తించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. (self-styled godman kisses Girl) కర్ణాటకలోని యాదిగిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాహాపూర్‌లోని ఒక ఆశ్రమానికి చెందిన మల్లికార్జున ముత్తవ తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు. ఏడేళ్ల బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఎదుటే ఆమెను హత్తుకొని ముద్దుపెట్టుకున్నాడు.
కాగా, బాలిక తల్లిదండ్రులు దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలిక పట్ల మల్లికార్జున ముత్తవ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి ఇది వెళ్లింది. మల్లికార్జున చర్యల వల్ల ఆ బాలిక చాలా అసౌకర్యంగా కనిపించినట్లు గుర్తించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆదేశించింది.
మరోవైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు ఆశ్రమాన్ని సందర్శించారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఆ బాలిక, ఆమె తల్లిదండ్రుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే మల్లికార్జున ముత్తవ చర్యలు తమకు అనుచితంగా అనిపించలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీసులకు నివేదిక ఇచ్చింది. మల్లికార్జున ముత్తవపై కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదిగిర్ ఎస్పీ తెలిపారు.
*ಯಾದಗಿರಿ: ಸ್ವಯಂಘೋಷಿತ ದೇವ ಮಾನವ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮುತ್ಯಾ ವಿರುದ್ದ ಮಕ್ಕಳ ಆಯೋಗ ದೂರು*https://t.co/NEBTrwSdMm
*Download the App and know your city news* – https://t.co/HTbKZOpbII pic.twitter.com/WyM4vRCKmQ— PublicNext (@ElectReps) February 25, 2026
Also Read:
Man with axe in head | పెళ్లి వేడుకలో ఒక వ్యక్తిపై దాడి.. తలలో దిగిన గొడ్డలితో హాస్పిటల్‌కు
Watch: డోర్ క్లోజ్ అవుతున్న లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు.. ఒక బాలిక ఏం చేసిందంటే?