Man with axe in head | పెళ్లి వేడుకలో ఒక వ్యక్తిపై దాడి.. తలలో దిగిన గొడ్డలితో హాస్పిటల్‌కు
Man with axe in head | పెళ్లి వేడుక బిజీలో ఉన్న వ్యక్తిపై ఒకడు దాడి చేశాడు. గొడ్డలితో తలపై వేటు వేశాడు. అది తలలో దిగింది. ఈ నేపథ్యంలో తలలో దిగిన గొడ్డలితో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే దానిని తొలగించడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు తెలిపారు.
లక్నో: పెళ్లి వేడుక బిజీలో ఉన్న వ్యక్తిపై ఒకడు దాడి చేశాడు. గొడ్డలితో తలపై వేటు వేశాడు. అది తలలో దిగింది. ఈ నేపథ్యంలో తలలో దిగిన గొడ్డలితో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే దానిని తొలగించడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు తెలిపారు. ఉన్నత ఆసుపత్రికి అతడ్ని రిఫర్ చేశారు. (Man with axe in head) ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 24న మోహన్పూర్ మాఫి గ్రామంలో కజిన్ సోదరి పెళ్లి వేడుకలో కృష్ణ కుమార్ బిజీగా ఉన్నాడు. వరుడి పెళ్లి ఊరేగింపునకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా, ఆ గ్రామానికి చెందిన రాజన్ చౌహాన్ గొడ్డలితో కృష్ణ కుమార్‌పై దాడి చేసి పారిపోయాడు. కృష్ణ తలలోకి గొడ్డలి దిగడంతో అతడు కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన బంధువులు తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కృష్ణను తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత బహ్రైచ్‌లోని మహారాజా సుహెల్దేవ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అక్కడి డాక్టర్లు కృష్ణ పరిస్థితిని పరిశీలించారు. అతడి పుర్రెలోకి లోతుగా దిగిన గొడ్డలిని తొలగించడం చాలా ప్రమాదకరమని అంచనా వేశారు. అధునాతన వైద్యం కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో టాప్‌లో మేఘాలయ.. 10,000 మందికిపైగా రోగులు
Dog Carries Human Leg | ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన కాలును నోట కరుచుకుని తిరిగిన కుక్క
Baby Loses Finger | ఐవీ డ్రిప్ తొలగిస్తుండగా నర్సు నిర్లక్ష్యం.. చిన్నారి వేలు కట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

