Dog Carries Human Leg | ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన కాలును నోట కరుచుకుని తిరిగిన కుక్క
Dog Carries Human Leg | ఒక వ్యక్తికి సర్జరీ చేసిన డాక్టర్లు అతడి కాలు భాగాన్ని తొలగించారు. డిస్పోజ్ కోసం దానిని భద్రపరిచారు. అయితే స్టోర్ రూమ్‌లోకి వచ్చిన ఒక కుక్క తెగిన కాలును నోటితో కరుచుకుని ఆ ఆసుపత్రిలో తిరిగింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది.
సిమ్లా: ఒక వ్యక్తికి సర్జరీ చేసిన డాక్టర్లు అతడి కాలు భాగాన్ని తొలగించారు. డిస్పోజ్ కోసం దానిని భద్రపరిచారు. అయితే స్టోర్ రూమ్‌లోకి వచ్చిన ఒక కుక్క తెగిన కాలును నోటితో కరుచుకుని ఆ ఆసుపత్రిలో తిరిగింది. (Dog Carries Human Leg) ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 19న అటల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్‌లో 61 ఏళ్ల అత్తర్ సింగ్‌కు సర్జరీ జరిగింది. కాలు పాదం భాగాన్ని డాక్టర్లు తొలగించారు. బయో వేస్ట్ కింద పారవేసేందుకు ఆసుపత్రి స్టోర్ రూమ్‌లోని ఒక కవరులో దానిని ఉంచారు.
కాగా, ఫిబ్రవరి 22న ఆ స్టోర్ రూమ్‌కు లాక్ వేయడాన్ని సిబ్బంది మరిచిపోయారు. దీంతో ఒక కుక్క అందులోకి ప్రవేశించింది. ఆ తెగిన కాలును నోటకరుచుకున్నది. ఆ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆ కుక్క తిరిగింది. ఇది చూసి జనం షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. రోగి నుంచి తొలగించిన కాలు భాగం స్టోర్ రూమ్ నుంచి మాయమైనట్లు గుర్తించింది. నిర్లక్ష్యం వహించిన పారిశుద్ధ్య పర్యవేక్షకుడు, సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
Also Read:
Baby Loses Finger | ఐవీ డ్రిప్ తొలగిస్తుండగా నర్సు నిర్లక్ష్యం.. చిన్నారి వేలు కట్
BSNL officer Tour | లగ్జరీ టూర్‌కు బీఎస్ఎస్ఎల్ అధికారి ప్లాన్.. షో కాజ్ నోటీస్ జారీ
రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై తల్లి మృతదేహం.. పక్కన ఏడుస్తూ పిల్లలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dog
- Mouth
- roams
- severed limb
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

