Baby Loses Finger | ఐవీ డ్రిప్ తొలగిస్తుండగా నర్సు నిర్లక్ష్యం.. చిన్నారి వేలు కట్
Baby Loses Finger | ఆరు నెలల చిన్నారి జ్వరం బారిన పడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఐవీ డ్రిప్ ఎక్కించారు. అయితే డిశ్చార్జ్ సమయంలో నర్సు నిర్లక్ష్యంగా వ్యహరించింది. ఐవీ డ్రిప్ తొలగించేటప్పుడు చిన్నారి వేలు కట్ చేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరు: ఆరు నెలల చిన్నారి జ్వరం బారిన పడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఐవీ డ్రిప్ ఎక్కించారు. అయితే డిశ్చార్జ్ సమయంలో నర్సు నిర్లక్ష్యంగా వ్యహరించింది. ఐవీ డ్రిప్ తొలగించేటప్పుడు చిన్నారి వేలు కట్ చేసింది. (Baby Loses Finger) దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. విజయ్ కుమార్ దంపతుల ఆరు నెలల కుమారుడు బాలకుమార్ ఫిబ్రవరి 19న తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడ్డాడు. ఆ చిన్నారిని ఇందిరానగర్‌లోని చిన్మయ మిషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అడ్మిట్ చేశారు. ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు చికిత్స అందించారు.
కాగా, ఆరోగ్యం మెరుగుపడటంతో ఫిబ్రవరి 24న ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి బిల్లులు క్లియర్ అయిన తర్వాత ఐవీ డ్రిప్ తొలగించినప్పుడు నర్సు అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. శిశువు ఎడమ చేతి చివరి వేలును కత్తిరించింది. ఆ చిన్నారి బాధతో ఏడ్వటంతో వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. తెగిన వేలు గాయానికి కట్టు కట్టారు.
మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు బాధతో అల్లాడిపోయాడని, శాశ్వతంగా వేలు కోల్పోయినట్లు తండ్రి ఆరోపించాడు. ఆ నర్సు, డాక్టర్‌తోపాటు హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
BSNL officer Tour | లగ్జరీ టూర్‌కు బీఎస్ఎస్ఎల్ అధికారి ప్లాన్.. షో కాజ్ నోటీస్ జారీ
రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై తల్లి మృతదేహం.. పక్కన ఏడుస్తూ పిల్లలు
IAF Officer Brutally Beaten By Mob | ఎయిర్‌ఫోర్స్ అధికారి, ఆయన తండ్రిపై.. పెళ్లి బృందం దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- baby
- Bengaluru
- Case filed
- finger
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

