IAF Officer Brutally Beaten By Mob | ఎయిర్‌ఫోర్స్ అధికారి, ఆయన తండ్రిపై.. పెళ్లి బృందం దాడి
IAF Officer Brutally Beaten By Mob | ఎయిర్‌ఫోర్స్ అధికారి తన తండ్రితో కలిసి కారులో వెళ్తున్నారు. పెళ్లి బృందం పబ్లిక్‌గా మద్యం సేవించి హంగామా చేయడంతో ఆయన ఆగ్రహించారు. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కారు హారన్ మోగించడంతో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ అధికారి, ఆయన తండ్రిపై పెళ్లి గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది.
లక్నో: ఎయిర్‌ఫోర్స్ అధికారి తన తండ్రితో కలిసి కారులో వెళ్తున్నారు. పెళ్లి బృందం పబ్లిక్‌గా మద్యం సేవించి హంగామా చేయడంతో ఆయన ఆగ్రహించారు. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కారు హారన్ మోగించడంతో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ అధికారి, ఆయన తండ్రిపై పెళ్లి గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. (IAF Officer Brutally Beaten By Mob) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రథమ్ సింగ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారి. ఆయన తండ్రి జితేంద్ర సింగ్ స్కూల్ టీచర్.
కాగా, ఫిబ్రవరి 19న బంధువుల నిశ్చితార్థ వేడుకలో ప్రథమ్ సింగ్, ఆయన తండ్రి పాల్గొన్నారు. ఆ తర్వాత కారులో తిరిగి వెళ్తున్నారు. జహంగీరాబాద్ రహదారిలో ఒక పెళ్లి బృందం ఊరేగింపుగా వెళ్తున్నది. పెద్ద మ్యూజిక్ మధ్య మద్యం తాగుతూ పలువురు డ్యాన్సు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరోవైపు కారు డ్రైవ్ చేస్తున్న ప్రథమ్ సింగ్ గట్టిగా హారన్ మోగించారు. ఈ సందర్భంగా పెళ్లి బృందంతో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మూకుమ్మడిగా ప్రథమ్ సింగ్, ఆయన తండ్రిపై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో వారిద్దరూ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు.
అయితే ఐఏఎఫ్ అధికారి ప్రథమ్ సింగ్ ఫిర్యాదుతో పెళ్లి బృందానికి చెందిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, ఎయిర్‌ఫోర్స్ అధికారి, ఆయన తండ్రిపై పెళ్లి గుంపు మూకుమ్మడిగా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In UP’s Bulandshahar, an Indian Air force official Pratham was assualted by a mob after he objected to men, part of wedding procession, consuming liquor and creating ruckus on the road. pic.twitter.com/kudZdvKTem
— Piyush Rai (@Benarasiyaa) February 22, 2026
Also Read:
Mamata Banerjee | బీజేపీ ఎంపీకి బెంగాల్ అత్యున్నత పురస్కారం.. ప్రదానం చేసిన మమతా బెనర్జీ, ఎందుకంటే?
Teacher Assaults 30 Students | వంగిన బైక్ నంబర్ ప్లేట్.. 30 మంది విద్యార్థులను చితకబాదిన టీచర్
Punjab Man Shoots Woman | పెళ్లిని తట్టుకోలేక.. మహిళపై కాల్పులు జరిపిన పొరుగు వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- beaten
- Brutally
- Father
- IAF Officer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

