చండీగఢ్: ఒక మహిళకు ఇటీవల వివాహం జరిగింది. అయితే పొరుగింటికి చెందిన వ్యక్తి దీనిని తట్టుకోలేకపోయాడు. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ మహిళ భర్తను కొట్టాడు. ఆమె తలపై గన్‌తో కాల్పులు జరిపాడు. (Punjab Man Shoots Woman) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గార్డెన్ కాలనీలో నివసించే రూబీ మెహ్రాకు కొన్ని నెలల కిందట వివాహం జరిగింది. అయితే అదే ప్రాంతంలో నివసించే కరణ్ పెళ్లికి ముందు ఆమెను వేధించాడు. ఆ మహిళ పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక పగ పెంచుకున్నాడు.
కాగా, ఫిబ్రవరి 21న సాయంత్రం 4.30 గంటల సమయంలో రూబీ తన భర్తతో కలిసి స్కూటీపై వెళ్తున్నది. మరో స్కూటీలో ఎదురుగా వచ్చిన కరణ్ వారిని అడ్డుకున్నాడు. రూబీ భర్త చెంపపై పలుమార్లు కొట్టాడు. అతడ్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రూబీ భర్తను అతడు కొట్టసాగాడు.
మరోవైపు అక్కడి నుంచి పారిపోయేందుకు రూబీ ప్రయత్నించింది. దీంతో కరణ్ ఆమె వెంటపడ్డాడు. తుపాకీ తీసి చాలా దగ్గరగా ఆమె తలపై కాల్చాడు. నేలపై పడిపోయిన రూబీపై మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇది చూసి ఆమె భర్త అక్కడి నుంచి పరుగెత్తాడు. ఆ తర్వాత కరణ్ కూడా తన స్కూటీపై పారిపోయాడు.
అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రూబీ మెహ్రా అమృత్‌సర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కరణ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The quiet of a street in a residential neighbourhood in #Punjab‘s #TarnTaran district was shattered by a violent altercation and gunshots on Saturday.
Around 4.30 pm, CCTV footage captured a man and a woman riding a scooter. Their path was suddenly blocked by another scooter… pic.twitter.com/2KfGcKBCct
— Hate Detector 🔍 (@HateDetectors) February 23, 2026
पंजाब के मोगा में चौंकाने वाली घटना: शादीशुदा ज़िंदगी के झगड़े के बीच पति ने नई शादीशुदा पत्नी को गोली मार दी।
एक वायरल पोस्ट में दावा किया गया है कि बरदान नाम के एक आदमी ने अपनी नई शादीशुदा पत्नी लक्ष्मी पर गरमागरम बहस के दौरान गोली चला दी।
कई गोलियां लगने के बाद महिला की हालत… pic.twitter.com/stXXF2VC88
— Anuj Agnihotri Swatntra (@ASwatntra) February 23, 2026
Also Read:
BJP leader denies blankets | ముస్లిం మహిళల పట్ల బీజేపీ నేత వివక్ష.. దుప్పట్ల పంపిణీ నిరాకరణ
Student gang raped at party | యువతి అత్యాచారం ఆరోపణ.. బ్లాక్మెయిల్ చేస్తున్నదని నిందితుడి ఫిర్యాదు