జైపూర్: ఒక బీజేపీ నేత ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపారు. వారికి దుప్పట్లు పంచబోనని చెప్పారు. ముస్లిం మహిళలకు పంపిణీ చేసిన బ్లాంకెట్స్‌ను వెనక్కి తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారితో అన్నారు. (BJP leader denies blankets) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని టోంక్ సవాయి మాధోపూర్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనాపురియా ఆదివారం ఒక కార్యక్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అయితే మహిళల పేర్లు అడిగి బ్లాంకెట్లు ఇవ్వాలని తన అనుచరులకు సూచించారు.
కాగా, ఒక ముస్లిం మహిళ తన పేరు చెప్పగా ఆమెకు దుప్పటి ఇవ్వవద్దని సుఖ్బీర్ సింగ్ చెప్పారు. ముస్లిం మహిళకు ఇచ్చిన బ్లాంకెట్‌ను వెనక్కి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించే వారికి దుప్పట్లు తీసుకునే హక్కులేదని తెలిపారు. ‘నా మాట వినండి, (ప్రధానమంత్రి) మోదీని దుర్భాషలాడే వారికి (దుప్పట్లు) తీసుకునే హక్కు లేదు. దాని గురించి మీరు చెడుగా అనుకుంటే నేనేమీ చేయలేను’ అని అన్నారు. ముస్లిం మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు, టోంక్ సవాయి మాధోపూర్ కాంగ్రెస్ ఎంపీ హరీష్ చంద్ర మీనా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ నేత సుఖ్బీర్ సింగ్ తీరును ఆయన ఖండించారు. ‘పేద, నిస్సహాయ మహిళల పేర్లు అడిగి దుప్పట్లు పంపిణీ చేయడం, వారి మతం తెలుసుకుని వెనక్కి తీసుకోవడం సిగ్గుచేటు, అమానుషం’ అని ఎక్స్‌లో విమర్శించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आज टोंक जिले की निवाई विधानसभा के ग्राम करेडा बुजुर्ग में भगवान के मंदिर पर पूर्व सांसद सुखबीर सिंह जौनापुरिया द्वारा मुस्लिम रोजेदार महिलाओं से किया गया व्यवहार न केवल निंदनीय है बल्कि इस देश के सामाजिक ताने बाने को नष्ट करने वाली विघटनकारी सोच का परिणाम है।
गरीब और असहाय… pic.twitter.com/Nhxrp12Wnf— Harish Chandra Meena (@HC_meenaMP) February 22, 2026
Also Read:
Kashmiri Pandits | దాడుల బెదిరింపు పోస్టర్లపై ఆందోళన.. భద్రత కోరిన కశ్మీరీ పండిట్లు
School Teachers Arrested For Rape | విద్యార్థినిపై అత్యాచారం.. ఐదుగురు టీచర్లు అరెస్ట్
Watch: డోర్ క్లోజ్ అవుతున్న లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు.. ఒక బాలిక ఏం చేసిందంటే?