లక్నో: ఒక వివాహిత మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. భార్య కోసం భర్త వెతకగా, ప్రియుడితో కలిసి ఉన్న ఆమె కనిపించింది. అయితే ఇంటికి తిరిగి వచ్చేందుకు భార్య నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో ఆమె పెళ్లిని భర్త జరిపించాడు. (Woman elopes with lover) ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చందౌలీకి చెందిన జీవనాథ్ రాజ్‌భర్, ఢిల్లీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య అయిన 45 ఏళ్ల సరిత ముగ్గురు పిల్లలతో కలిసి చందౌలీలో నివసిస్తున్నది.
కాగా, ఒక ప్రయాణంలో రైలులో వేరుశనగలు అమ్ముకునే అజయ్‌తో సరితకు పరిచయం ఏర్పడింది. భర్త ఇంటికి దూరంగా ఉండటంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలను వదిలేసిన సరిత, తన వయసులో సగం వయసు చిన్నవాడైన అజయ్‌తో కలిసి పారిపోయింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న జీవనాథ్ గత నాలుగు నెలలుగా భార్య సరిత కోసం అన్నిచోట్ల వెతికాడు. చివరకు స్థానిక రైల్వే స్టేషన్లో అనుకోకుండా సరిత, అజయ్ అతడికి ఎదురుపడ్డారు. ఇంటికి తిరిగి రావాలని భార్యను అతడు ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది. ప్రియుడు అజయ్‌తోనే తన జీవితం గడుపుతానని ఆమె మొండిగా చెప్పింది.
దీంతో చేసేదేమీ లేక భార్య, ఆమె ప్రియుడికి పెళ్లి జరిపించాలని భర్త జీవనాథ్ నిర్ణయించాడు. వారిద్దరిని మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. తన సమక్షంలోనే సరిత, అజయ్‌కు వివాహాన్ని జరిపించాడు. ‘ఆమె నాతో కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నా. కానీ ఆమెకు ఇష్టం లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు’ అని జీవనాథ్ అన్నాడు.
అయితే తమ వివాహం విచ్ఛిన్నం కావడానికి భర్త జీవనాథ్ కారణమని సరిత ఆరోపించింది. ఇంటి ఖర్చులకు తగినంత డబ్బు పంపించకపోవడంతో తామిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఆమె చెప్పింది.