న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను సస్పెండ్ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది. తోటి కమిషనర్ల ఆమోదం తీసుకోకుండా సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ, అతడిని సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ప్రధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా, సీఈసీ జ్ఞానేశ్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.